శామ్‌సంగ్ నుంచి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్ లైనప్ Samsung Galaxy  S23 సిరీస్ లాంచింగ్ ఎప్పుడో  కంపెనీ వెల్లడించింది. 2023, ఫిబ్రవరి మొదటి వారంలో లాంచింగ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ వేడుకలో అధికారికంగా గెలాక్సీ S23 లైనప్‌ ను ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత గెలాక్సీ అన్‌ ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారి అని కంపెనీ తెలిపింది. ఈ లాంచింగ్ ఈవెంట్  శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.


ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో Samsung Galaxy సిరీస్‌ను అధికారికంగా ఆవిష్కరించనుంది.  GSMArena యొక్క నివేదిక ప్రకారం.. ఫిబ్రవరిలో S23 సిరీస్ లాంచ్ అయిన కొద్ది రోజుల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.  కొన్ని లీక్‌లు, ఊహాగానాల ప్రకారం  Samsung Galaxy S23 సిరీస్ మొత్తం Snapdragon 8 Gen 2-పవర్డ్‌గా ఉండబోతోంది.  Samsung  Exynos చిప్‌సెట్‌ను పూర్తిగా తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక Xiaomi 13 ఫ్లాగ్‌ షిప్ లైనప్ Qualcomm  టాప్-టైర్ స్నాప్‌ డ్రాగన్ 8 Gen 2 మొబైల్ SoCతో ఈ వారం ఆవిష్కరించబడుతుంది. Vivo ఇప్పటికే దాని X90 Pro+ని Snapdragon 8 Gen 2 చిప్‌ సెట్‌ తో విడుదల చేసింది.


Samsung Galaxy S23 సిరీస్ స్పెక్స్, ఫీచర్లు ఇలా ఉండవచ్చు!


Galaxy S23 లైనప్ Apple iPhone 14 నుండి ఒక ఫీచర్‌ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ను కూడా అప్‌ గ్రేడ్ చేస్తుంది. టెక్ పబ్లికేషన్ ETNews  ఇటీవలి నివేదిక ప్రకారం, Galaxy S23 సిరీస్ ఈ సంవత్సరం iPhone 14 లైనప్‌లో మనం చూసిన శాటిలైట్  కనెక్టివిటీని కలిగి ఉండే అవకాశం ఉంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Galaxy S23 లైన్‌కు ఒక విధమైన శాటిలైట్  కమ్యూనికేషన్ వ్యవస్థను తీసుకురావడానికి  ఇరిడియం కమ్యూనికేషన్స్‌తో కలిసి పనిచేస్తోంది.  ఇరిడియం కమ్యూనికేషన్స్ 66 లో ఆర్బిల్  ఉపగ్రహాల ద్వారా వాయిస్ కాలింగ్, డేటా కమ్యూనికేషన్ సేవలను అందిస్తోంది. శామ్‌సంగ్ తన స్మార్ట్‌ ఫోన్‌లకు శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను తీసుకురావడానికి ఇరిడియంతో కలిసి రెండేళ్లుగా పని చేస్తోంది.


ప్రపంచం ఇప్పటి వరకు చూడని అత్యుత్తమ కెమెరా


Galaxy S23 లైనప్ స్పెషల్ హైలైట్ Galaxy S23 అల్ట్రా. ఇది 200MP ప్రైమరీ కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Samsung Galaxy S23 Ultra  200MP కెమెరా Xiaomi 12T ప్రోలో కనిపించే 200MP కెమెరా కంటే మెరుగ్గా ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రఖ్యాత లీక్‌స్టర్ ఐస్ యూనివర్స్ ప్రకారం, గెలాక్సీ S23లోని 200MP కెమెరా ప్రపంచం ఇప్పటి వరకు చూడని అత్యుత్తమమైన కెమెరాగా అభివర్ణించింది.


Read Also: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!