అపరిమిత మొబైల్ డేటా, వాయిస్ కాలింగ్, అదనపు ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌ల కోసం చూసే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో, ఎయిర్‌ టెల్ సంస్థలు చక్కటి ఆఫర్లను అందిస్తున్నాయి. 2 GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, SMS ప్రయోజనాలను అందించే మల్టీఫుల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అదనంగా, OTT యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందిస్తున్నాయి.  


Jio రోజువారీ 2GB డేటా ప్లాన్


Jio రూ.249 ప్లాన్


ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 2GB రోజువారీ డేటా పరిమితితో 46GB మొత్తం డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, 23 రోజుల వాలిడిటీతో Jio TV, Jio సినిమా, Jio సెక్యూరిటీ, Jio క్లౌడ్‌తో సహా Jio యాప్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.


Jio రూ 299 ప్లాన్


ఈ ప్యాక్ 2GB రోజువారీ డేటా పరిమితితో 56GB డేటాను అందిస్తుంది. అపరిమిత కాలింగ్‌తో, రోజుకు 100 SMSలు, Jio TV, Jio సినిమా, Jio సెక్యూరిటీ, JioCloud  ప్యాక్‌తో సహా Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.


Jio రూ. 533 ప్లాన్


56 రోజుల ప్లాన్ వాలిడిటీతో 2GB రోజువారీ డేటా, 112GB మొత్తం డేటా లభిస్తుంది. 100 రోజువారీ SMSలు, అపరిమిత కాలింగ్, Jio TV, Jio సినిమా, Jio సెక్యూరిటీ, Jio క్లౌడ్‌తో సహా అన్ని Jio యాప్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.


Jio రూ. 719 ప్లాన్


వినియోగదారులు 2GB రోజువారీ పరిమితితో 168 GB డేటాను పొందే అవకాశం ఉంటుంది.  అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను పొందుతారు. 84 రోజుల ప్యాక్ వాలిడిటీతో అన్ని జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.


జియో రూ. 2879 ప్లాన్


ఈ ప్రీపెయిడ్ ప్యాక్ 365 రోజుల ప్లాన్ వాలిడిటీతో, 2GB రోజువారీ డేటాతో 730GB మొత్తం డేటా లభిస్తోంది.  అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, Jio యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.


ఎయిర్‌టెల్ 2GB రోజువారీ డేటా ప్లాన్  


ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్


ఈ ప్లాన్ 1 నెల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటాను అందిస్తుంది, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, Apollo 24/7 సర్కిల్‌కు సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌ బ్యాక్, ఉచిత HelloTunes, వింక్ మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.


ఎయిర్‌టెల్ రూ. 359 ప్లాన్


ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్,  అపోలో 24/7 సర్కిల్, Xstream మొబైల్ ప్యాక్ సబ్‌స్క్రిప్షన్‌తో రోజుకు 100 SMSలు, అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.


ఎయిర్‌టెల్ రూ. 399 ప్లాన్


ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో అపోలో 24/7 సర్కిల్‌కు సబ్‌స్క్రిప్షన్,  2.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది.


ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్


ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, అదనపు ప్రయోజనాలతో Disney+ Hotstar మొబైల్‌కి 1-సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.


ఎయిర్‌టెల్ రూ. 549 ప్లాన్


ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో,  రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.


ఎయిర్‌టెల్ రూ. 839 ప్లాన్


ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.


ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్


ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. 2.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, కాంప్లిమెంటరీగా 84 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అందిస్తుంది.


ఎయిర్‌టెల్ రూ. 2,999 ప్లాన్


ఈ వార్షిక ప్లాన్ రోజుకు 2GB డేటాను అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, Amazon Prime మొబైల్‌  సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది.


ఎయిర్‌టెల్ రూ. 3,359 ప్లాన్


ఈ ప్లాన్ ఏడాది వ్యాలిడిటీతో 2.5GB రోజువారీ డేటాను అందిస్తోంది.  డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ మొబైల్‌ 1-సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు అందిస్తోంది.


Read Also: 5G రోల్ అవుట్ అంటే 4G ముగిసిపోతుందా? భారత్ లో ఏ ఫోన్లు 5Gకి చేస్తాయంటే?