IND vs NZ ODIs Records: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ (IND vs NZ) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 110 సార్లు తలపడగా, అందులో టీమ్ఇండియా 55 సార్లు, కివీస్ జట్టు 49 సార్లు విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టై కాగా, 5 మ్యాచ్ లు రద్దు అయ్యాయి. ఈ మ్యాచ్‌లలో 10 అత్యంత ప్రత్యేకమైన రికార్డులు ఏంటో ఇక్కడ చర్చిద్దాం. 


1. టాప్‌ స్కోరు: ఈ రికార్డు టీమ్ఇండియా పేరిట నమోదైంది. 2009 మార్చి 8న క్రైస్ట్ చర్చ్ వన్డేలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సచిన 163 పరుగులు చేశారు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. యువరాజ్‌ సింగ్‌ 87 పరుగులు చేస్తే ధోనీ 68 పరుగులు చేశారు. 


2. అత్యల్ప స్కోరు: 2016 అక్టోబర్ 29న జరిగిన విశాఖపట్నం వన్డేలో కివీస్ జట్టు కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయింది. అమిత్‌ మిశ్రా అద్భుతమైన బౌలింగ్‌తో కివీస్‌ను దెబ్బతిశాడు. కేవలం ఆరు ఓవర్లే వేసి 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఈ దెబ్బతు మ్యాన్ అఫ్‌ ద మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా కైవశం చేసుకున్నాడు అమిత్‌ మిశ్రా. 


3. బిగెస్ట్‌ విక్టరీ: 2010 ఆగస్టులో జరిగిన దంబుల్లా వన్డేలో న్యూజిలాండ్ 200 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది. ట్రై సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ వన్డేలో న్యూజిలాండ్‌ ముందు బ్యాటింగ్ చేసి 288 పరుగులు చేసింది. స్టైరిస్‌, రాస్ టేలర్ రాణించారు. తర్వాత ఛేజింగ్‌ కోసం దిగిన భారత్‌ కేవలం 88 పరుగులకే కుప్పకూలింది. సెహ్వాగ్, దినేష్ కార్తీక్‌, రవీంద్రజడేజా మినా వేరెవ్వరూ రెండంకెల స్కోర్ దాటలేదు. ఇందులో జడెజా చేసిన 20 పరుగులే అత్యధిక స్కోరు. 


4. అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్ తో జరిగిన 42 మ్యాచ్ ల్లో 1750 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాటింగ్ సగటు 46.05.


5. ఉత్తమ ఇన్నింగ్స్: 1999 నవంబరులో జరిగిన హైదరాబాద్ వన్డేలో సచిన్ టెండూల్కర్ కివీస్ జట్టుపై 150 బంతుల్లో 186 పరుగులతో అజేయంగా నిలిచాడు.


6. అత్యధిక సెంచరీలు: న్యూజిలాండ్ పై వీరేంద్ర సెహ్వాగ్ 6 సెంచరీలు సాధించాడు. కివీస్ జట్టుపై అతని బ్యాటింగ్ సగటు 50+ గా ఉంది.


7. అత్యధిక వికెట్లు: ఇక్కడ కూడా భారత ఆటగాడు ముందున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన 30 మ్యాచుల్లో జవగళ్ శ్రీనాథ్ 51 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు ఆయనతే ఆ రికార్డు.


8. ఉత్తమ బౌలింగ్: 2005 ఆగస్టులో బులవాయో వన్డేలో షేన్ బాండ్ కేవలం 19 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.


9. అత్యధిక మ్యాచ్లు: సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్ తో 42 మ్యాచ్ లు ఆడాడు.


10. అత్యధిక భాగస్వామ్యం: 1999 నవంబరులో జరిగిన హైదరాబాద్ వన్డేలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ రెండో వికెట్ కు 331 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.