తన అత్యద్భుతమైన బ్యాటింగ్‌తో సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా టీమిండియాకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్న. ICC ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ T20I బ్యాటర్ అయిన సూర్య 2022 టీ20 ప్రపంచ కప్‌లో మూడో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లలో 189.68 స్ట్రైక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు.


న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో అతను తన ఫామ్‌ను కొనసాగించాడు. అద్భుతమైన సెంచరీ సహా రెండు ఇన్నింగ్స్‌లలో 124 పరుగులు చేశాడు. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.


ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ అతని బ్యాటింగ్‌ను చాలా ప్రశంసించాడు. ”మ్యాచ్ ప్రారంభమైందని నాకు తెలియదు. కానీ నేను తర్వాత స్కోర్‌కార్డ్‌ని చూసి, దాన్ని ఫొటో తీసి ఆరోన్ ఫించ్‌కు పంపించాను. అసలక్కడ ఏం జరుగుతోంది? అతను పూర్తిగా భిన్నమైన గ్రహంపై బ్యాటింగ్ చేస్తున్నాడు. అందరి స్కోర్‌లను, తన స్కోర్‌ను చూడండి" అని మాక్స్‌వెల్ అన్నాడు.


"తర్వాతి రోజు ఇన్నింగ్స్ పూర్తి రీప్లేను చూశాను. ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే అతను అందరికంటే చాలా మెరుగైనవాడు. అతని బ్యాటింగ్‌ను తోటి బ్యాటర్‌గా చూడటం చాల కష్టం. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరూ తనకు దగ్గరగా లేరు."


"మా వద్ద సూర్యకుమార్ యాదవ్‌ను కొనడానికి తగినంత డబ్బు లేదు. అస్సలు దానికి అవకాశమే లేదు. క్రికెట్ ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ ప్లేయర్‌ను తొలగించాలి (నవ్వుతూ).", అన్నాడు. సూర్యకుమార్ తదుపరి న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు.