SP Leader Car Hit By Truck: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ నాయకుడి కారును ఢీ కొట్టింది. అంతేకాకుండా ఆ కారును సుమారు అర కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లింది.
ఇదీ జరిగింది
సమాజ్‌వాదీ పార్టీ మెయిన్‌పురి జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ కారును ఓ ట్రక్కు ఆదివారం రాత్రి ఢీ కొట్టింది. అనంతరం దాన్ని 500 మీటర్లు ట్రక్కుతోపాటే ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హత్య కుట్రా?
కారును ఢీ కొట్టిన అనంతరం ట్రక్కును ఆపాలని అక్కడున్న వారు వెంబడించినా డ్రైవర్ పట్టించుకోలేదు. వాహనాన్ని అలాగే వేగంగా పోనిచ్చాడు. 500 మీటర్ల దూరం వెళ్లాకా ఆగాడు.
ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను యూపీలోని ఇటావాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే కారును ఢీ కొట్టారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేకుంటే కారును ఢీ కొట్టిన వెంటనే డ్రైవర్.. ట్రక్కును ఎందుకు ఆపలేదనే ప్రశ్న వినిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సమాజ్‌వాదీ పార్టీ నేతకు చెందిన కారు కావడంతో రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
మరో ఘటన
దిల్లీలోని ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటన వైరల్‌గా మారింది. 10 నుంచి 12 మంది అల్లరి మూక ఒకేసారి పోలీస్ స్టేషన్‌లోకి చొరబడ్డారు. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్‌ను దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. అనంతరం కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఆగస్టు 3నే జరిగినప్పటికీ ఆలస్యంగా బయటకు వచ్చింది.
Also Read: Patra Chawl Scam Case: సంజయ్ రౌత్‌కు మళ్లీ షాక్- ఆగస్టు 22 వరకు జుడీషియల్ కస్టడీ!
Also Read: Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!