Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ సొసైటీ ఎన్నికలు కుమ్ములాటకు దారి తీశాయి. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. మహిళలు జుట్లు పట్టుకుని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
నోయిడా సెక్టార్ 78లోని హైడ్ పార్క్ సొసైటీలోని ఓ ఆపార్టుమెంట్ రెసిడెంట్స్ సొసైటీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీపడుతున్న ఒక వర్గం వారికి అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరో వర్గం మహిళలు గొడవ చేశారు. దీంతో మహిళా సెక్యూరిటీ గార్డులు సదరు మహిళలపై కర్రలతో దాడి చేశారు.
దీంతో ఆ మహిళలంతా.. మహిళా సెక్యూరిటీ గార్డులపై ఎదురుదాడికి దిగారు. ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ గొడవ మరింత ముదరడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇద్దరు మహిళా గార్డులపై కేసులు నమోదు చేశారు
వీడియో వైరల్
ఈ వీడియోలో ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులు అపార్టుమెంట్ వాసులైన కొందరు మహిళలపై కర్రలతో దాడి చేసిన దృశ్యాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Himachal Pradesh Polls: చాయ్‌వాలాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన భాజపా!