ABP  WhatsApp

Uttar Pradesh News: కట్నం ఇవ్వలేదని భార్యపై గ్యాంగ్ రేప్- తర్వాత త్రిపుల్ తలాఖ్!

ABP Desam Updated at: 29 Jul 2022 03:58 PM (IST)
Edited By: Murali Krishna

Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. కట్నం ఇవ్వలేదని భార్యపై మరొక వ్యక్తితో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు భర్త.

కట్నం ఇవ్వలేదని భార్యపై గ్యాంగ్ రేప్- తర్వాత త్రిపుల్ తలాఖ్!

NEXT PREV

Uttar Pradesh News:  ఓ భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను మరొక వ్యక్తితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.


ఇదీ జరిగింది


లఖ్‌నవూకు చెందిన మహ్మద్ అద్నాన్ అనే వ్యక్తి కట్నం ఇవ్వనందుకు కట్టుకున్న భార్యపై దారుణానికి పాల్పడ్డాడు. తన కజిన్‌తో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు.


కట్నం కోసం


పెళ్లయిన నాటి నుంచి తన భర్త కట్నం కోసం డిమాండ్ చేసేవాడని బాధితురాలు తెలిపింది. తరచు తనను కొట్టేవాడని వాపోయింది. అయితే మరో వ్యక్తితో కలిసి తన పుట్టింటికి వచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 



భర్త పెట్టే హింస కారణంగా బాధితురాలు పుట్టింట్లో ఉంటోంది. అయితే ఇటీవల అద్నాన్ తన కజిన్‌తో కలిసి అత్తమామల ఇంటికి వెళ్లి, ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. చట్టవ్యతిరేఖ విధానమైన ట్రిపుల్ తలాఖ్ ద్వారా ఆమెకు విడాకులు ఇచ్చాడు.                                                                 - ఆకాష్ తోమర్, ఎస్‌పీ 


సామూహిక అత్యాచారం కేసులో పరారీలో ఉన్న అద్నాన్, అతని కజిన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


చట్టంలో


2019 ఆగస్టు 1న ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా కేంద్రం చట్టం తెచ్చింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ట్రిపుల్​ తలాఖ్​ క్రిమినల్​ నేరం. మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.


ఈ చట్ట ప్రకారం ముందస్తు బెయిల్​పై నిషేధం ముస్లిం భర్తలకే వర్తిస్తుందని ఇటీవల సుప్రీం ధర్మాసనం ఓ కేసులో తెలిపింది. బెయిల్​కు సంబంధించి చట్టంలోని వివిధ సెక్షన్లను, నేరశిక్షాస్మృతిలో నిబంధనలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది.


కోడల్ని వేధిస్తున్న మహిళకు ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. తన భర్త ట్రిపుల్​ తలాఖ్​ ఇచ్చారంటూ ఓ మహిళ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. ఇందులో నిందితురాలిగా ఉన్న అత్తకు బెయిలివ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. అయితే 2019 చట్టంలోని బెయిల్​ నిషేధ నిబంధనలు ట్రిపుల్​ తలాఖ్​ ఇచ్చిన ముస్లిం భర్తకు మాత్రమే వర్తిస్తాయని బాధితురాలి అత్తకు వర్తించవని ధర్మాసనం పేర్కొంది.


Also Read: UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకబడ్డ రిషి- ఆ ఒక్క హామీ కొంప ముంచింది!


Also Read: Manisha Ropeta: పాకిస్థాన్‌లో హిందూ మహిళ రికార్డు- DSPగా బాధ్యతలు!

Published at: 29 Jul 2022 03:48 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.