UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో ఒక్క అడుగు దూరంలో ఉన్న రిషి సునక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, దేశ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యేందుకు జరుగుతున్న పోరులో తాను వెనుకబడినట్లు అంగీకరిస్తున్నట్లు రిషి సునక్ ప్రకటించారు. అయితే చివరి వరకు పోరాటం సాగిస్తానని తేల్చిచెప్పారు.
ఇదే కొంప ముంచిందా
ప్రధాని రేసులో ఇప్పటివరకు ముందంజలోనే ఉన్న రిషి.. అవకాశాలను ఆ ఒక్క హామీ దెబ్బతీసింది. ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రుస్ ఇటీవల ఓ హామీ ఇచ్చారు. లిజ్ ట్రుస్ తనను గెలిపిస్తే, ప్రధాన మంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే వ్యక్తిగత పన్నుల్లో కోతను విధిస్తానని హామీ ఇచ్చారు. అయితే రిషి సునక్ ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా వివరించి, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే వరకు వ్యక్తిగత పన్నుల్లో కోత విధించే ప్రసక్తే లేదని చెప్పారు.
లిజ్ ట్రుస్ బాగా ముందంజలో కనిపిస్తుండటంతో తన విజయావకాశాలను మెరుగుపరచుకోవడం కోసం రిషి కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు దాదాపు 1,75,000 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. ఎన్నికల ఫలితాలను సెప్టెంబరు 5న ప్రకటిస్తారు.
రిషి ప్రొఫైల్
రిషి సునక్ భారత మూలాలున్న వ్యక్తి మాత్రమే కాదు భారత సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు కూడా. సౌతాంప్టన్‌లో జన్మించిన రిషి సునాక్ పాతికేళ్లకే మిలియనీర్ అయ్యారు. ఆయన తల్లిదండ్రులు భారత మూలాలున్న వారే అయినప్పటికీ వారు ఈస్ట్ ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. అక్కడే స్థిరపడ్డారు. అక్కడే పుట్టిన రిషి సునాక్.. ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలో చేశారు. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత గోల్డ్ మాన్ శాచ్స్ లో కొంత కాలం పని చేశారు . రెండు హెడ్జ్ ఫండ్స్‌లో పార్టనర్‌గా కూడా ఉన్నారు. అక్కడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె పరిచయడం కావడంతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత బ్రిటన్‌లో వ్యాపారాలు ప్రారంభించారు.
Also Read: Manisha Ropeta: పాకిస్థాన్‌లో హిందూ మహిళ రికార్డు- DSPగా బాధ్యతలు!
Also Read: Rashtrapatni Remark Row: కాంగ్రెస్ నేత అధీర్ రంజన్‌కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు