Vijay Devarakonda: ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. అతి తక్కువ కాలంలోనే అగ్రతారగా ఎదిగిన రష్మికా మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అయితే అర్జున్ రడ్డి సినిమాతో అమ్మాయిల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారంటూ చాలానే వార్తలు వచ్చాయి. గత కొంత కాలంగా ఇలాంటి ప్రచారం సాగుతున్నప్పటికీ అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ నోరు మెదపలేదు.  


విజయ్ ఫ్యామిలీతో గోవా వెళ్లిన రష్మిక..


దీంతో ఇది నిజమేనని చాలా మంది అనుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్స్ లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారిందని, అందుకే దేవరకొండ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు రష్మిక హాజరవుతోందంటూ ప్రచారం సాగింది. అలాగే ఆయన ఫ్యామిలీతో కలిసి రష్మిక న్యూ ఇయర్ వేడుకలకు గోవా వెళ్లడం అప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మొట్ట మొదటి సారి హీరో విజయ్ దేవరకొండ రష్మికతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించాడు. కాఫీ విత్ కరన్ షోలో పాల్గొన్న ఆయన కరణ్ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్తూ... రష్మిక గురించి మాట్లాడాడు. 


రష్మిక నా డార్లింగ్.. నాతో అన్నీ పంచుకుంటుంది!


రష్మిక నా డార్లింగ్, నా బెస్ట్ ఫ్రెండ్స్ లో తను ఒకరు అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. తనంటే అభిమానం, ఇష్టం ఉందని.. నా జీవితంలోని ఎత్తు పల్లాల గురించి ఏదీ దాచకుండా ఆమెతో పంచుకునే మంచి స్నేహం మా ఇద్దరి మధ్య ఉందంటూ వివరించాడు. రష్మిక కూడా నా వద్ద ఏదీ దాచకుండా చెబుతుందని స్పష్టం చేశాడు. అయితే ప్రజలు అందరూ అనుకున్నట్లుగా తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని..తాము రిలేషన్ లో లేమని స్పష్టం చేశాడు. 


అప్పుడే నా రిలేషన్ షిప్ గురించి నోరు విప్పుతా...


ఇక ప్రజెంట్ రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పాలంటూ కరణ్ అడగగా విజయ్ తెలివగా సమాధానం చెప్పాడు. తన ప్రేమాయణం గురించి చెప్పి అభిమానులను బాధ పెట్టడం ఇష్టం లేదని కామెంట్లు చేశాడు. ఏదో ఒకరోజు తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని... పిల్లల్ని కూడా కంటానని అన్నాడు. ఆరోజు తన రిలేషన్ షిప్ గురించి అందరికీ చెబుతానని పేర్కొన్నాడు. అప్పటి వరకు తన ప్రేమాయణాన్ని రహస్యంగానే ఉంచడం మంచిదంటూ పేర్కొన్నాడు. 


Also Read: కారులో, బోటులో సెక్స్ చేశా - విజయ్ దేవరకొండ


ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా తెరకెక్కింది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇందులో విజయ్ ముంబయి మురికి వాడకు చెందిన యువకుడిగా ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఆయన పాత్రలో రమ్య కృష్మ నటించాడు. అనన్యా పాండే కథానాయిక మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. విజయ్ దేవరకొండ నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. ధర్మా ప్రొడక్షన్ల్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. 


Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?