UP Municipal Polls: ఉత్తర్‌ప్రదేశ్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న హిందూ మహా సభ సంచలన హామీ ఇచ్చింది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మేయర్ అయితే మేరఠ్ నగరం పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తామని ప్రకటించింది.
అంతేకాదు
మేరఠ్ మాత్రమే కాకుండా నగరంలో ఉన్న ముఖ్య ప్రదేశాల పేర్లకు కూడా హిందూ నేతల పేర్లను పెడతామని హిందూ మహా సభ వెల్లడించింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ ఓ మేనిఫెస్టో సైతం విడుదల చేసింది. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని, గోమాతను కాపాడుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొంది.
నగరపాలక సంస్థలో అన్ని వార్డులకూ పోటీ చేస్తున్నామని, దేశభక్తి కలిగిన వారికే అవకాశం ఇస్తామని హిందూ మహాసభ మేరఠ్ జిల్లా అధ్యక్షుడు అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా భాజపా, శివసేనపై విమర్శలు గుప్పించారు.
Also Read: US Walmart Store Shooting: అమెరికాలో కాల్పులు- 10 మంది మృతి, పలువురికి గాయాలు!