US News: అమెరికాలో ఓ మహిళ రికార్డు సృష్టించింది. 30 ఏళ్ల క్రితం ఫ్రిజ్‌లో పెట్టిన అండాలతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. అత్యంత సుదీర్ఘ కాలం ఘ‌నీభ‌వించిన అండాల‌తో పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం చ‌రిత్ర‌లో ఓ కొత్త రికార్డుగా మారింది. 


స్టోర్ చేసి


1992, ఏప్రిల్ 22న ద్ర‌వ‌రూప నైట్రోజెన్‌లో మైన‌స్ 128 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌తల మ‌ధ్య ఈ అండాల‌ను స్టోర్ చేశారు. వివాహం చేసుకున్న జంట నుంచి ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా క‌వ‌ల అండాల‌ను క్రియేట్ చేశారు. 2007 వ‌ర‌కు అమెరికా ప‌శ్చిమ తీరంలోని ఓ ఫెర్టిలిటీ ల్యాబ్‌లో ఉన్న ఆ అండాల‌ను టెన్నిసిలోని నాక్స్‌విల్లేలోని ఎన్ఈడీసీకి ఇటీవల డోనేట్ చేశారు.


టెన్నిసి రాష్ట్రానికి చెందిన రేచ‌ల్ రిడ్జ్‌వే అనే మ‌హిళ ఆ అండాల‌తో క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఒరేగాన్‌కు చెందిన ఆమెకు అప్ప‌టికే న‌లుగురు పిల్ల‌లు ఉన్నారు. అక్టోబ‌ర్ 31న ఆమెకు మళ్లీ క‌వ‌ల‌లు జ‌న్మించారు.




దానం చేసిన అండాల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 1200 మంది చిన్నారులు పుట్టిన‌ట్లు నేష‌న‌ల్ ఎంబ్రియో డోనేష‌న్ సెంట‌ర్ పేర్కొంది. అయితే అత్యంత సుదీర్ఘం కాలం ఘ‌నీభ‌వించిన అండాల‌తో పిల్ల‌ల్ని క‌న‌డం ఇదే తొలిసారి అని తెలిపింది. గ‌తంలో మోలీ గిబ్స‌న్ అనే మ‌హిళ 2020లో ఘ‌నీభ‌వించిన అండాల‌తో పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. 27 ఏళ్ల క్రితం నాటి అండాల‌తో ఆమె శిశువును క‌న్న‌ది.


Also Read: Yuvraj Singh Gets Notice: యువరాజ్ సింగ్‌కు గోవా సర్కార్ నోటీసులు- ఎందుకంటే?