US Walmart Store Shooting: అమెరికా (America)లో మళ్లీ కాల్పుల మోత మోగింది. వర్జీనియాలోని వాల్‌మార్ట్‌ (Walmart) స్టోర్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది వరకు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.






వాల్‌మార్ట్‌ స్టోర్‌లో ఓ సాయుధుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరిన పోలీసులు, కాల్పులు జరిపి దుండగుడ్ని హతమార్చారు.






అమెరికాలో ఈ ఏడాది కాల్పుల ఘటనలు భారీగా నమోదయ్యాయి. మే లో జరిగిన టెక్సాస్ (Texas) కాల్పులు చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఘటనగా పేర్కొన్నారు. టెక్సాస్‌లోని ఉవాల్డే నగరంలో ఉన్న పాఠశాలలో 600 మంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాలలోకి ప్రవేశించిన 18 ఏళ్ల బాలుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాడి చేసిన టీనేజర్ సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్ చదువుతున్న అమాయక పిల్లలను లక్ష్యంగా చేసుకున్నాడు. కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది మరణించారు. 


అమెరికాలో గతంలో జరిగిన తుపాకీ కాల్పుల దాడులు ఇవీ



  • 2012- న్యూ టౌన్‌లోని శాండీ హుక్ స్కూల్‌పై దాడి, కాల్పుల్లో 26 మంది మృతి

  • 2016 - టెక్సాస్ ఆల్పైన్ స్కూల్ కాల్పుల్లో ఒక విద్యార్థి మరణించాడు

  • 2018- టెక్సాస్‌లోని సెయింట్ ఫే స్కూల్‌లో కాల్పులు, 17 ఏళ్ల బాలుడు కాల్పులు జరిపాడు, 10 మంది మరణించారు.

  • 2021 - టెక్సాస్‌లోని టింబర్‌వ్యూ స్కూల్‌లో కాల్పులు, కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.

  • 2022 - టెక్సాస్ ప్రాథమిక పాఠశాలలో కాల్పులు, 14 మంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు మరణించారు, 18 ఏళ్ల నిందితుడైన వ్యక్తిని హతమార్చారు.


Also Read: US News: అమెరికాలో అద్భుతం- 30 ఏళ్ల నాటి అండాలతో కవలలకు జన్మనిచ్చిన మహిళ!