ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోన్న వేళ ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా దాడిని తిప్పికొట్టేందుకు ప్రజలనే సైనికులుగా మార్చి ముప్పేట దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కీలక ప్రకటన చేశారు.
దేశం విడిచి వెళ్లొద్దు
18-60 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు బ్యాన్ విధించినట్లు ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ సర్వీస్ చీఫ్ డేనియల్ మెన్షికోవ్ ప్రకటించారు.
[quote author=డేనియల్ మెన్షికోవ్, ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ సర్వీస్ చీఫ్]యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఉండే 18-60 ఏళ్ల మధ్య పురుషులు దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు బ్యాన్ విధించాం. కంగారు పడొద్దు. అనుమతి లేకుండా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించవద్దు.
[/quote]
కీవ్ సమీపంలో
రష్యా చేస్తోన్న యుద్ధంపై అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా సేనలు చొరబడ్డాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కర్ఫ్యూ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలులో ఉంది.