ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర పన్నుల వాటాను డబుల్ చేసి రిలీజ్ చేసింది. ప్రతి నెలా విడుదల చేసే కేంద్ర పన్నుల్లో వాటాను ఈ సారి రెట్టింపు చేశారు. అంటే.. మరో నెల వాయిదాను ముందుగానే ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కలిపి ఈ నెల పన్ను వాటా కింద రూ. 47,541 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉంది. అయితే రూ. 95,082 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే వచ్చే నెల పన్నుల వాటాను కూడా ఒక నెల ముందుగానే ఇస్తోంది. 


Also Read: జగన్ సర్కార్ కు మరో షాక్... ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ... జీతాల ప్రాసెస్ కు నో ...!


ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ ప్రకారం ఈ నెల విడుదల చేస్తున్న రూ. 95,082 కోట్లలో తెలుగు రాష్ట్రాలకు 5,840 కోట్లు అందనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క నెల పన్నుల వాటా కింద రూ. 1,923.98 కోట్లు వస్తుంది. అయితే ఈ సారి రూ. 3,847.96 కోట్లు విడుదల చేసింది. వచ్చే నెల పన్నుల వాటాను కూడా ముందుగానే జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర పన్నుల వాటా నెలకు రూ. 999.31 కో ఇప్పుడు అడ్వాన్స్ కలిపి  రూ. 1,998.62 కోట్లువిడుదల చేసింది. 


Also Read: ఉద్యోగుల ఉద్యమం లైట్.. ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు.. బిల్లులు రెడీ చేయాలని ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు !


రెండు నెలల పన్నుల వాటాను ఒకే సారి ఇచ్చే విధానాన్ని కేంద్ర గత నవంబర్‌లో ప్రారంభించింది. నవంబర్‌తో పాటు డిసెంబర్‌లో కూడా రావాల్సిన పన్నుల వాటాను నవంబర్ నెలలోనే ఇచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థిక కష్టాల నుంచి బయటపడ్డాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. పన్నుల వాటాల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 17,056.56 కోట్లు, బిహార్ రాష్ట్రం రూ. 9,563.30 కోట్లు, మధ్యప్రదేశ్ రాష్ట్రం 7,463. 92 కోట్లు పొందనున్నాయి.


Also Read: సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !


పన్నుల వాటాలు అన్ని రాష్ట్రాలకు రాజ్యాంగ బద్దంగా వచ్చేవే. అయినా పన్నుల్లో వాటాను ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని బట్టి చూడరు. అందుకే తెలంగాణ కన్నా ఏపీకి డబుల్ పన్నుల వాటా వస్తుంది. తెలంగాణకు నెలకు వెయ్యి కోట్ల రూపాయలలోపే పన్నుల వాటా ఉంది. కానీ ఏపీకి దాదాపుగా రూ. రెండు వేల కోట్లు వస్తున్నాయి. 



Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.