తెలుగు హీరోల్లో మెజారిటీ యంగ్‌స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆల్ ఓవర్ ఇండియా ఆడియన్స్‌ను మైండ్‌లో పెట్టకుని ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. 'పుష్ప'తో బన్నీ కూడా బాలీవుడ్, ఒన్ ఇండియా బాట పట్టారు. హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తనకు పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఉందని ఓ ఆంగ్ల పత్రికతో చెప్పారు.
'పాన్ ఇండియా సినిమా చేసే ప్లాన్స్ ఉన్నాయా?' అని విష్ణు మంచును అడిగితే... "అవును. హిందీ సినిమాలు చేయడం నాకు ఇష్టమే. భగవంతుడికి ఆ ఆశ చేరుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో 'డీ అండ్ డీ' (డబుల్ డోస్) సినిమా, నూతన దర్శకుడితో మరో కామెడీ థ్రిల్లర్ చేయడానికి అంగీకరించారు. ఆ రెండిటిలో ఏదో ఒక సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 11న స్టార్ట్ చేస్తానని చెప్పారు.
బాలీవుడ్‌కు ఉన్నంత రీచ్ టాలీవుడ్ సినిమాలకు ఉంటే... బాక్సాఫీస్‌ను షేక్ చేయించేవని విష్ణు మంచు అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమాలు హిందీలో బాగా ఆడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలో బాలీవుడ్ బ్యాక్ సీట్ తీసుకుంటుందని, తెలుగు - తమిళ సినిమాలు ముందువరుసలో ఉంటాయని ఆయన చెప్పారు.
Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
Also Read: విడాకుల వేడిని క్యాష్ చేసుకుంటున్న సుమంత్ అండ్...
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
Also Read: పుట్టబోయే బిడ్డ కోసం... కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి