5G Flights : ప్రపంచానికి "5జీ"తో ముప్పు పొంచి ఉందా ? ఫ్లైట్స్‌ను ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు ? ఏం జరగనుంది ?

5జీ పై ప్రజల్లో ఎన్నో సందేహాలు.. రూమర్స్ ఉన్నాయి. వాటిలో ఎంత నిజముందో కానీ.. అమెరికాలో 5జీ వల్ల విమాన ప్రమాదాలు జరుగుతాయని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. దీంతో ముప్పు నిజమేనా అన్న చ్చ ప్రారంభమయింది.

Continues below advertisement


ఇప్పటి వరకూ 4 జీ సర్వీసులను ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు 5జీ అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో ఈ 5జీ సేవలను రెండు కంపెనీలు ప్రారంభించడంతో అనేక సమస్యలు వస్తున్నాయి.  అమెరికాకు వెళ్లాల్సిన పలు విమానాలను రీషెడ్యూల్‌ ్య్యాయి. భారత్‌లోని ఎయిర్‌ ఇండియా సైతం అగ్రరాజ్యానికి వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామనిగా ప్రకటించింది. దీనికి కారణం 5 జీ సేవల వల్ల విమానాలకు ముప్పు ఉండటమే. అమెరికాలో 5జీ సేవలు ప్రారంభించంతో  విమానాల రాకపోకుల గందరగోళంగా మారాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ను కూడా క్యాన్సిల్ చేయడం.. రీ షెడ్యూల్ చేయడం వంటివి చేశారు. అయితే 5జీ వల్ల విమానాలకు ఎలాంటి ముప్పు ఉందన్నదానిపై ఇప్పటి వరకూ పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ సేవలు ప్రారంభమైన తర్వాత విశ్లేషిస్తే.. విమానాలు చాలా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నట్లుగా అంచనా వేస్తున్నారు. 

Continues below advertisement

Also Read: బుర్జ్ ఖాలీఫాపై మహిళ.. ఈ సారి విమానంతో సహా థ్రిల్లింగ్ స్టంట్, చూస్తే వావ్.. అనాల్సిందే!

5జీ టెక్నాలజీ రేడియో సిగ్నల్స్‌ ఆధారంగా నడుస్తుంది.  5జీలో వాడే రేడియో సిగ్నల్స్, విమానాల్లోని రేడియో ఆల్టీమీటర్లలో ఉపయోగించే సిగ్నల్స్‌కు దగ్గరగా ఉంటాయి. అల్టీ మీటర్ల ద్వారా భూమి నుంచి విమానం ఎత్తును కొలుస్తారు. భద్రత, నావిగేషన్ సిస్టమ్‌ల డేటా కోసం వీటిని వాడతారు. 5జీ స్పెక్ట్రమ్‌లో వాడే రేడియో తరంగాల వల్ల విమానాల్లోని ఈ పరికరాల పనితీరుకు ఆటంకం కలుగుతుంది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయి. అదే జరిగితే తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నట్లే లెక్క. 5జీ సిగ్నల్స్ వల్ల అత్యాధునిక విమానంలోని నియంత్రణ వ్యవస్థల్లో సమస్యలు ఎదురవుతాయని అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. 

Also Read: అంతర్జాతీయ విమాన సర్వీసులపై డీజీసీఏ కీలక ప్రకటన.. కరోనా థర్డ్ వేవ్ కారణమని వెల్లడి

ఈ సమస్యల వల్ల ల్యాండింగ్‌ సమయంలో విమానం వేగాన్ని తగ్గించడం సాధ్యం కాదు. అదే జరిగితే రన్ వే దాటి విమానం ముందుకెళ్లడమో.. పక్కకు పోవడమో జరుగుతుంది. ఇది తీవ్ర ప్రమాదానికి కారణం అవుతుంది. 5జీని కంపెనీలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే విమానాలు నడపడం సాధ్యం కాదన్న అంచనాకు అమెరికా విమానయాన సంస్థలు వస్తున్నాయి. ఇప్పటికైతే అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమై.. సమస్యలేంటో తెలుస్తున్నాయి. ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికీ స్పష్టత లేదు. కొన్ని దేశాల్లో  విమానాశ్రయాల దగ్గర 5జీ సిగ్నల్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమానాశ్రయాల చుట్టూ తాత్కాలిక బఫర్ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 

Also Read: పారిస్‌లో అసలైన సుడిగాడు ! పని చేయించుకోకుండా జీతం ఇచ్చారని కంపెనీపై కేసు.. అక్కడా రూ.33 లక్షలు వెనకేశాడు !

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ 

 

 

Continues below advertisement