ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తగ్గించడం, హెచ్‌ఆర్‌ఏనూ కోత పెట్టడం, ఫిట్‌మెంట్ కన్నా ఎక్కువగా ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయాలని ఆదేశించడం.. డీఏలన్నీ కోత పడిన జీతానికి సరి పెట్టడంతో  ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయి. ఆరేడు డీఏలు కలిసినా పీఆర్సీ వల్ల ఒక్క రూపాయి జీతం పెరగకపోగా హెచ్‌ఆర్‌ఏ భారీగా తగ్గిపోవడంతో .. జీతంలో కోత పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.  దీంతో ఉద్యోగ సంఘ నేతలపై ఒత్తిడి పెరిగింది. 


Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు


మధ్యాహ్నం ప్రెస్‌మీట్ పెట్టిన చీఫ్ సెక్రటరీ ఇక ఎలాంటి మార్పులు చేసేది లేదని ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు లేదని తేల్చేశారు. అంతే కాకుండా ప్రభుత్వం చాలా ఎక్కువగా ఉద్యోగులపై ఖర్చు పెడుతోందన్నారు. ఈ సమాచారంతో ఉద్యోగులు మరితం ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగికి రూ.6 నుంచి 7వేల వరకు జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందని ఎపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పీఆర్‌సీ వద్దు.. డీఏలతో కూడిన 27శాతం ఐఆర్‌ ఇస్తున్న పాత జీతమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 


Also Read: AP PRC : ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..


ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టుపెట్టేందుకు తాము సిద్ధంగా లేమని... సమ్మెకు దిగాలని నిర్ణయించాయని బండి శ్రీనివాసరావు ప్రకటించారు. 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల ఆశలను వమ్ము చేయమన్నారు. జీవోలను వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఉద్యోగ సంఘం నేతలు ఇప్పటికే ప్రకటించారు.  


Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు


ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. సమ్మె చేసి ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే ప్రత్యామ్నాయ చర్యలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అన్ని పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. వారు కూడా సమ్మెలోకి వెళ్తే వాలంటీర్లు రెడీగా ఉన్నారు. ఇంకా కావాలంటే తాత్కాలిక నియామకులు జరుపుకుని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలనే ఆలోచన చేసే అవకాశం ఉంది. గతంలో సమ్మె చేస్తున్న ఉద్యోగుల్ని ఒక్క కలం పోటుతో డిస్మిస్ చేసి.. తమిళనాడు సీఎం జయలలిత సంచలనం సృష్టించారు. ఆ తరహా పరస్థితులు ఏర్పడతాయేమోనన్న చర్చ ప్రారంభమైంది. 



Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.