"బన్నీ" సినిమాలో  రఘుబాబు కళ్లను వేరే వాళ్లకి పెట్టించేస్తాడు హీరో అర్జున్. తర్వాత రఘుబాబును ఆయన బాస్ వచ్చి.. ఏం జరిగిందిరా అంటే... "కళ్లు దొబ్బేశారన్నా" అంటాడు. కళ్లను ఎలా దొబ్బేశారో బాస్‌కు అర్థం కాదు. ఎగ్జాట్‌గా ఇలాగే కాదులే కానీ.. టర్కిలోని ఓ  బిజినెస్ మాత్రం ఇదే తరహాలో బాధపడిపోతున్నాడు. ఆయన బాధేమిటంటే.. తన స్పెర్మ్‌ని దొంగించారట. అలా దొంగిలించడమే కాదు..  ఆ స్పెర్మ్‌తో కవల పిల్లల్ని కూడా కన్నారట. ఈ విషయాన్ని బిజినెస్ కోర్టులో చెప్పుకున్నాడు. ఈ కథంతో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లాలి. 


Also Read: వ్వాట్ ..యాన్ ఐడియా సర్‌జీ.. క్యూలో నిలబడితే రోజుకు రూ. 16 వేలు !


కొన్నాళ్ల క్రితం టర్కీలోని ఓ బిజినెస్‌మెన్‌కు సెన్సారి అనే మహిళ పరిచయం అయింది. సెన్సారి అనే మహిళ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది.  వ్యాపారి మాత్రం తన భార్య, పిల్లతో జీవిస్తున్నాడు. అయితే పరిచయం అయిన మహిళతో సహజీవనం చేశాడు. తనకు మగ పిల్లలు లేరు కాబట్టి మగపిల్లవాడ్ని కంటే పోషించడానికి డబ్బులు ఇస్తానని వ్యాపారి ప్రపోజల్ పెట్టాడు. దానికి ఆమె అంగీకరించింది. ఇద్దరికీ అప్పటికే కాస్త వయసు ఎక్కువ కావడంతో సహజ పద్దతిలో గర్భం రావడం కష్టమని అతని స్పెర్మ్ తీసుకుని సైప్రస్ వెళ్లింది. అక్కడ ఐవీఎఫ్ పద్దతిలో వ్యాపారి స్పెర్మ్‌తో కవల పిల్లల్ని కన్నది. టర్కీలో  పెళ్లి కాని జంటల ఐవీఎఫ్‌ను చట్టం అంగీకరించదు. అందుకే సైప్రస్ వెళ్లింది. 


Also Read: సరసాలతో సంపాదన.. అమ్మాయిలతో ‘పులిహోర’ కలపడమే ఇతడి ఉద్యోగం


ఇద్దరు మగ పిల్లలతో ఆమె తిరిగి వస్తే చెప్పిన మాట ప్రకారం వారసుడు పుట్టినందుకు ఆనందించాల్సిన ఆ వ్యాపారి ముఖం చాటేశాడు. ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు. దాంతో ఆమె కోర్టుకెళ్లింది. కోర్టు విచారణలో వ్యాపారి ఆ పిల్లలు తన పిల్లలు కాదనే వాదించాడు. డీఎన్ఏ టెస్ట్ చేయిద్దామంటే అడ్డం తిరిగాడు. చివరికి మరో వింత వాదన వినిపించడం ప్రారంభించాడు. అదేమిటంటే.. ఆమె తన స్పెర్మ్ దొంగిలించిందని. ఈ వాదన విని . కోర్టుతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. 


Also Read: కౌగిలించుకుంటే ఇన్ని ప్రయోజనాలా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు.. ఇక చెలరేగిపోతారు


ప్రస్తుతం ఈ కేసు విచారణ టర్కీలో సాగుతోంది. తన స్పెర్మ్ .. తనతో సహజీవనం చేసిన మహిళ దొంగిలించిందని నిరూపించగలిగితే అదో సంచలనం అవుతుంది. లేకపోతే... శిక్షకు గురవుతాడు. అయినా.. అవేమైనా కిడ్నీలా.. కళ్లా.. మత్తు మందు ఇచ్చి తీసుకెళ్లడానికి అని సెటైర్లు వినిపిస్తున్నాయి. వ్యాపారి అడ్డంగా బుక్కయ్యాడని అంటున్నారు. 






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి