నిజామాబాద్ కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు మహిళను అడ్డుకున్నారు. దర్శనం రాణి అనే మహిళ 30 ఏళ్ల క్రితం బంటు పోచమ్మ, పోశయ్య వద్ద పొలం కొనుగోలు చేసింది. బాండ్ పేపర్ పై పెద్దల సమక్షంలో పొలం కొనుగోలు చేశానని బాధితురాలు దర్శనం రాణి తెలిపారు. ఆ పొలం తమదేనంటూ అమ్మినవారు తమను ఇబ్బంది పెడుతున్నారని కలెక్టరేట్ ఎదుట దర్శనం రాణి ఇవాళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దర్శనం రాణిది బోధన్ మండలం ఆచన్ పల్లి గ్రామం. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని  బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పొలంలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తోంది.


Also Read: టార్గెట్ 2023... వరంగల్ లో దూకుడు పెంచిన బీజేపీ



Also Read:  ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..


నిజామాబాద్ జిల్లా కలెక్టరే‌ట్‌లో ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు వచ్చింది ఓ కుటుంబం. వీరిలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లికి చెందిన దర్శనం వాణి ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. 30 ఏళ్ల క్రితం నుంచి సాగుచేసుకుంటున్న రెండు ఎకరాల భూమిని ధరణిలో వేరే వాళ్ల పేరిట పాస్ బుక్ జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామ మాజీ సర్పంచ్ తమపై దాడులకు ప్రయత్నిస్తున్నట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తమపై దాడులు చేస్తున్నారని పోలీస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు భూమిని విక్రయించిన వారితో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూమి లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


Also Read: TS High Court: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు


Also Read: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..


Also Read: Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి