Telangana News Today: తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం - అన్ని వివరాలు తెలుస్తాయన్న ప్రభుత్వం, స్వాగతించిన బీఆర్ఎస్, కానీ!
తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. కుల గణన చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేసి.. ప్రజల ఆర్థిక స్థితి గతులు తెలుసుకుంటామని అన్నారు. సర్వేలో అన్ని వివరాలు పొందు పరుస్తామని.. సర్వ రోగ నివారిణిలా సర్వే ఉంటుందని పేర్కొన్నారు. కాగా, కులగణనను తాము ఆహ్వానిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత కడియం తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కుర్చీ మడత పెట్టిన నారా లోకేశ్ - సీటు లేకుండా చేస్తామంటూ సీఎం జగన్ కు వార్నింగ్
'మీరు చొక్కాలు మడతపెడితే.. మేం కుర్చీలు మడత పెట్టి సీటు లేకుండా చేస్తాం' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సీఎం జగన్ (CM Jagan)ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అది ఎలా చేస్తామో చూపిస్తామంటూ విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని శంఖారావం సభలో ఓ కుర్చీని మడతపెట్టి చూపించారు. ఈ సమయంలో టీడీపీ, జనసేన అభిమానులు, కార్యకర్తల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది.  పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


విశాఖ తూర్పులో రాజకీయం ఆసక్తికరం.. నాడు ప్రత్యర్థులు- నేడు మిత్రులు
విశాఖ తూర్పు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు విజయం కోసం పోటీ పడిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకటయ్యారు. మరో నేతపై ఇరువురు విమర్శనాస్త్రలు సంధిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయంగా పోటీ పడి, ఇప్పుడు ఏకతాటికిపై వచ్చిన ఆ ఇద్దరి నేతలే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌. ఈ ఇద్దరు నేతలకు ఒకరంటే ఒకరికి పడదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ ప్రాజెక్ట్ కోసం నిధులు
తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో కొత్తపల్లి-మనోహరాబాద్ కొత్త రైల్వే మార్గంలో నూతన రైల్వే స్టేషన్‌కు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి పాల్గొన్నారు.  కొమురవెల్లి ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రాజధాని ఫైల్స్ కు తొలగిన అడ్డంకులు - రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
‘రాజధాని ఫైల్స్‌’  సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి