Nara Lokesh Warning to CM Jagan in Nellimarla Shankaravam Meeting: 'మీరు చొక్కాలు మడతపెడితే.. మేం కుర్చీలు మడత పెట్టి సీటు లేకుండా చేస్తాం' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సీఎం జగన్ (CM Jagan)ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అది ఎలా చేస్తామో చూపిస్తామంటూ విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని శంఖారావం సభలో ఓ కుర్చీని మడతపెట్టి చూపించారు. ఈ సమయంలో టీడీపీ, జనసేన అభిమానులు, కార్యకర్తల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు. 'రాజధాని ఫైల్స్ సినిమా, రైతులంటే సీఎం జగన్ కు భయమేస్తోంది. ఆ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారు. మూడు రాజధానులంటూ ఊదరగొట్టి.. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా.?. మూడు ముక్కలాట ఆడుతున్న వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్.. ఇప్పుడేం చెబుతారు. ఆ దుకాణాల వద్దే చర్చ పెట్టుకుందాం. అక్కడకు వచ్చేందుకు సిద్ధమా.? ప్రభుత్వమే అధికారులను నియమించి టార్గెట్ పెడుతోంది. ఐదేళ్లుగా విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా.? జగన్ అధ్భుతమైన స్కామ్ స్టార్. అధికారంలోకి వచ్చాక దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.' అని లోకేశ్ మండిపడ్డారు.
Also Read: Rajadhani Files : రాజధాని ఫైల్స్ కు తొలగిన అడ్డంకులు - రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్