Telugu News Today: ఇక్కడ సిద్దం- అక్కడ జనగర్జన పేర్లు మాత్రమే తేడా - మిగతాది సేమ్‌ టు సేమ్‌!
సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అయితే.. ఏపీ(Andhrapradesh)లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌(YSR Congress party), ప‌శ్చిమ బెంగాల్‌ లో అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్(TMC) మ‌ధ్య సారూప్య‌త‌లు క‌నిపిస్తు న్నాయి. ఏపీలో అయితే.. అసెంబ్లీ, పార్లెమెంటు ఎన్నిక‌లు రెండూ క‌లిసి వ‌స్తున్నాయి. దీంతో మ‌రింత వేడి పెరిగింది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది కేవ‌లం పార్ల‌మెంటు ఎన్నిక‌లే ఉన్నాయి. ఇక్క‌డ కూడా రాజకీయం స‌ల‌స‌ల మ‌రుగుతోంది. దీనికి కార‌ణం.. కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ స‌ర్కారును ఢీ అంటే డీ అన్నట్టుగా రాజ‌కీయాలు సాగుతుండ‌డమే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


టికెట్ల సర్దుబాటులో టీడీపీ, జనసేన, బీజేపీ చర్చలు- చంద్రబాబు నివాసానికి నేతల క్యూ
అమరావతిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి నేతలు క్యూ కడుతున్నారు. పొత్తు ఖాయమైన వేళ సీట్ల సర్దుబాటుపై ఫోకస్‌పెట్టాయి టీడీపీ, జనసేన, బీజేపీ. వీటిపై చర్చించేందుకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.  ఆయనతో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. కాసేపట్లో పవన్ కల్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు- పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు పూజల్లో పాల్గొన్నారు. తొలిసారిగా సీఎం హోదాలో గుట్టకు వచ్చిన రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు పూజలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మరో పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం- నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలుకు జోరుగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయగా, గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీపై అందించే పథకాన్ని ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


జనసేన నేత కందుల దుర్గేష్‌కు నిడదవోలు- రాజమండ్రిలో బుచ్చయ్యకు లైన్ క్లియర్
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య టికెట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. ఎప్పటి నుంచో సస్పెన్ష్‌గా ఉన్న కందుల దుర్గేష్ వ్యవహారం ఇవాళ జనసేన తేల్చేసింది. ఆయన్ని నిడదవోలు నుంచి బరిలో నిలుపుతున్నట్టు పార్టీ ప్రకటించింది. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రాజమండ్రి రూరల్ కోసం పట్టుబట్టారు. అక్కడ టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఉండటంతో కందుల దుర్గేష్‌ను నిడదవోలుకు మార్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి