Quick Trick to Reduce Belly Fat : బరువు తగ్గడం, బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడానకి చాలా కష్టపడతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరికి కొవ్వు తగ్గదు. ముఖ్యంగా పొట్ట భాగంలో.. బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ఆలస్యంగా కరుగుతుంది. అయితే ఈ కొవ్వును వేగంగా కరించుకునేందుకు.. ఓ ఎఫెక్టివ్ వ్యాయామం ఉంది అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా కొవ్వు వేగంగా కరుగుతుంది అంటున్నారు. ఇంతకీ అది ఏ వ్యాయామమో.. ఏ ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 


వ్యాయామం విషయానికొస్తే.. 


ముందుగా నేలపై లేదా యోగా మ్యాట్​పై పడుకోవాలి. తలకింద చేతులు పెట్టుకుని.. ఇప్పుడు మీ కుడి మోచేతిని.. ఎడమ మోకాలికి టచ్ చేయాలి. ఇప్పుడు ఎడమ మోచేతిని.. కుడి కాలుతో టచ్ చేయాలి. ఈ క్రంచ్స్​ను రోజూ పది నిమిషాలు చేయాలి. లేదంటే నిటారుగా నిల్చోని.. చేతులను తల వెనుక భాగంలో ఉంచి.. మోచేతులను, మోకాళ్లను టచ్ చేయాలి. ఇలా రెగ్యూలర్​గా చేయడం వల్ల పొట్ట, బొడ్డు చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది అంటున్నారు. మీకు జిమ్​ వెళ్లడం కుదరకపోతే.. ఇంట్లోనైనా ఈ వ్యాయామం సులువుగా చేయవచ్చు. ఇది పొట్టపై, సైడ్స్​పై కాస్త ప్రెజర్​ పెట్టి.. కొవ్వు వేగంగా కరిగేలా చేస్తుంది. 


ఫుడ్స్ విషయంలో.. 



  • అవకాడో.. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్​ పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి మీకు కడుపు నిండుగా ఉండి.. సంతృప్తిగా అనిపించడంలో సహాయం చేస్తాయి. అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. 

  • బెర్రీస్​లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, రాస్ప్​బెర్రీస్ బరువు తగ్గడానికి, పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తాయి.

  • ప్రోటీన్, ప్రోబయోటిక్స్​తో గ్రీక్​ యోగర్ట్ నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. హెల్తీ గట్​ను ప్రోత్సాహిస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది.

  • బచ్చలి కూర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి అధిక ఫైబర్​ను కలిగి ఉండి.. బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. 

  • సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును తగ్గించి.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

  • బాదం, వాల్​నట్స్ వంటి ఇతర నట్స్​లలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి హెల్తీ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. ఇవి ఆకలిని అరికట్టి.. బరువు తగ్గడాన్ని ప్రోత్సాహిస్తాయి. అంతేకాకుండా వీటిని హెల్తీ స్నాక్స్​గా తీసుకోవచ్చు. 

  • ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి ఆహారాలలో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి.. కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తాయి. 


Also Read : పరగడుపునే ఇవి తాగితే.. మధుమేహం, బరువు కంట్రోల్​లో ఉంటుందట



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.