RRR has been recognized as one of the world's greatest stunt movies by the Oscar Awards 2024: ఆస్కార్స్ 2024 వేడుక 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్ర బృందానికి డబుల్ ధమాకా అందించింది. లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్, అమెరికాలో జరిగిన 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్' (The Academy Awards 2024) 96వ అవార్డుల వేడుకలో రెండుసార్లు స్టేజి మీద 'ఆర్ఆర్ఆర్' విజువల్స్ ప్రదర్శించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
స్టంట్స్ గురించి ప్రస్తావించినప్పుడు...
RRR team surprised by Oscars 2024 sweet gesture: 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు గత ఏడాది ఆస్కార్ వచ్చిన విషయం అందరికీ తెలుసు. 'ఆర్ఆర్ఆర్' అంటే ఆ పాట ఒక్కటే కాదు... కథ, కథలో ఎమోషన్, ఆ ఎమోషన్ నుంచి వచ్చిన యాక్షన్ / స్టంట్ సీక్వెన్సులు కూడా! ముఖ్యంగా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన స్టంట్స్ భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని ఎంత గానో అలరించాయి. ఇప్పుడు ఆ స్టంట్స్ (RRR Stunts recognized by Oscars 2024)కు అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్స్ మరోసారి గుర్తింపు తెచ్చింది.
సినిమా కోసం జీవితాలను పణంగా పెట్టేది స్టంట్ కమ్యూనిటీ అంటూ ఆస్కార్స్ స్టేజి మీద స్టంట్ మాన్ గొప్పతనాన్ని వివరించారు. ప్రపంచంలో ది బెస్ట్, గ్రేటెస్ట్ స్టంట్స్ కొన్నిటిని ప్రదర్శించారు. అందులో 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన స్టంట్ సీక్వెన్సుకు చోటు కల్పించారు. ఈ స్వీట్ సర్‌ప్రైజ్ ఊహించని 'ఆర్ఆర్ఆర్' టీమ్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ ఆస్కార్స్ వేడుకలో స్టేజి మీద 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' సాంగ్ విజువల్స్ కూడా ప్లే చేశారు. ఇది 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి డబుల్ డిలైట్ అని చెప్పాలి.
ఆస్కార్స్ 2024లో 'నాటు నాటు...' సాంగ్ ఎందుకు ప్లే చేశారో తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై నాటు నాటు - ఇండియన్స్ కు మరోసారి ప్రైడ్ మూమెంట్!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అయ్యాయి. 'స్టూడెంట్ నంబర్ 1' నుంచి మొదలు పెడితే 'ఆర్ఆర్ఆర్' వరకు ప్రతి సినిమాలోనూ స్టంట్ / యాక్షన్ సన్నివేశాలపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించబోయే తదుపరి సినిమా మీద మరింత శ్రద్ధ వహిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read: క్రిస్టోఫర్ నోలన్‌కు ఫస్ట్ ఆస్కార్, ఏడు అవార్డులతో సత్తా చాటిన 'ఓపెన్ హైమర్' - 2024లో విజేతలు వీరే
మహేష్ బాబు హీరోగా గ్లోబ్ ట్రాంటింగ్ జానర్ మూవీ తీయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. కథా నేపథ్యం దేశ, విదేశాల్లో ఉంటుంది. అందువల్ల, రాజమౌళికి స్టంట్స్ మరింత వైవిధ్యంగా రూపొందించే అవకాశం ఉంటుంది.