Telugu News Today: Chandrababu: సచివాలయం తాకట్టు ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! - చంద్రబాబు
ఏపీ సచివాలయం తాకట్టు పెట్టారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రూ. 370 కోట్ల కోసం సచివాలయాన్ని ఓ బ్యాంకుకు తాకట్టు పెట్టారని ఓ ప్రధాన పత్రికలో కథనం ప్రచురితం అయింది. దీనిపై చంద్రబాబు స్పందించారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని అన్నారు. రాష్ట్ర సచివాలయం తాకట్టు పెట్టడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి ఎంత అవమానకరం.. ఎంత బాధాకరం.. ఎంత సిగ్గు చేటు అని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు, ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఏంటి? - పెద్దిరెడ్డి కామెంట్స్
ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటున్న వెంకయ్య నాయుడు, చంద్రబాబు తమ పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు కానీ పేద పిల్లలు చదవకూడదా? అని నిలదీశారు. కదిరి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్న వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ముందుగా తనకల్లు మండలంలో నిర్వహిస్తున్న వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - పొంగులేటితో కలిసి రెండోసారి
బీఆర్ఎస్ కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇలా ఆయన సీఎంను కలవడం ఇది రెండోసారి. తాజాగా కుటుంబసభ్యులతో సహా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటూ ఓ వినతిపత్రాన్ని రేవంత్‌ రెడ్డికి తెల్లం వెంకట్రావు అందజేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మజ్లిస్ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ కొత్త ప్రయత్నం - మహిళా అభ్యర్థికి చాన్స్ ! సంచలనానికి చాన్స్ ఎంత ?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. అసదుద్దీన్ ఒవైసీ కోటను బద్దలు కొట్టేందుకు కొత్త వ్యూహాలను రచిస్తోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానం 1984 నుంచి ఎంఐఎం చేతిలోకి వెళ్లిపోయింది.నాడు అక్కడి ఎంఐఎం అభ్యర్థిగా ఉన్న సలావుద్దీన్ ఒవైసీ.. 2004 వరకు వరుసగా ఆరు పర్యాయాలు విజయం సాధించగా, ఆయన మరణం తర్వాత వారసుడైన అసదుద్దీన్ నేటి వరకు ఎంపీగా గెలుస్తూ వచ్చారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలి - ఏపీ హైకోర్టులో పిల్
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న గడువు మరో మరో మూడు నెలల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. కానీ, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంత కాలం పొడిగించాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ మేరకు ఒక చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ సెక్రెటరీని ఆదేశించాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగియబోతోంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి