Telugu News Today: 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం- యూనివర్శిటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఇవాళ భేటీ అయిన కేబినెట్‌లో అమోదం తెలిపింది. దీంతోపాటు మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఆమోదం తెలిపింది. 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మంత్రిమండలి చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా ఓకే చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జగన్‌కు పోటీగా రాంబాబు - ఏపీ ప్రజల ఓటు ఎటు వైపు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 'సిద్ధం' అంటూ సమరశంఖం పూరిస్తే... తెలుగుదేశం పార్టీ 'సంసిద్ధం' అంటూ కౌంటర్ ఇచ్చింది. జనసేన 'మేము సిద్ధమే' అంటూ బరిలో నిలిచింది. ఇప్పుడీ రాజకీయాలు థియేటర్లలోకి వచ్చాయి. జగన్ సినిమాకు పోటీగా పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ అవుతోంది. మరి, ఏపీ ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూడాలి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కేసీఆర్, కేటీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తా, ఎవరైనా కలవొచ్చన్న సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు...కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) అపాయింట్‌మెంట్ కోరినా ఇస్తానని ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy ) వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కలవొచ్చని...అందరికి అపాయింట్మెంట్ ఇస్తానని వెల్లడించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చన్నారు. తాను అందుబాటులో లేని సమయంలో...డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం నోటీసులు - కేటీఆర్ స్పందన ఏమిటంటే ?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను కొడుకు అని సంబోధిస్తూనే కాంగ్రెస్ పార్టీ నేత మాణిక్యం ఠాగూర్ షాక్ ఇచ్చారు. కొడుకుకు పరువు నష్టం నోటీసు పంపినట్టు మాణిక్యం ఠాగూర్ తెలిపారు. కేటీఆర్ తన ఫామ్ హౌస్‌లో ఉల్లాసంగా గడుపుతూ ఉండొచ్చు కానీ 7 రోజుల్లో నోటీసుపై స్పందించాలని మాణిక్యం ఠాగూర్ కోరారు. కేటీఆర్ 7 రోజుల్లో స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని తెలిపారు. జనవరి 28న సిరిసిల్లలో కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మాణిక్యం ఠాగూర్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అవసరమైతే మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారిస్తానన్న స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram)కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే (Rebel Mlas)లను మరోసారి విచారణకు పిలుస్తానన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడనన్న ఆయన...అనేక విషయాలపై ఇంకా మాట్లాడాల్సి ఉందన్నారు. తాను అడగాల్సింది అడిగానన్న ఆయన, ఎమ్మెల్యేలు చెప్పాల్సింది చెప్పారని తమ్మినేని సీతారాం తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి