Congress MP Manikyam Tagore has sent defamation notices KTR : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను కొడుకు అని సంబోధిస్తూనే కాంగ్రెస్ పార్టీ నేత మాణిక్యం ఠాగూర్ షాక్ ఇచ్చారు. కొడుకుకు పరువు నష్టం నోటీసు పంపినట్టు మాణిక్యం ఠాగూర్ తెలిపారు. కేటీఆర్ తన ఫామ్ హౌస్‌లో ఉల్లాసంగా గడుపుతూ ఉండొచ్చు కానీ 7 రోజుల్లో నోటీసుపై స్పందించాలని మాణిక్యం ఠాగూర్ కోరారు. కేటీఆర్ 7 రోజుల్లో స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని తెలిపారు. జనవరి 28న సిరిసిల్లలో కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మాణిక్యం ఠాగూర్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మాణిక్యం ఠాగూర్ కు సోషల్ మీడియాలో కేటీఆర్ రిప్లై ఇచ్చారు. అవి తాను అన్న మాటలు కాదని.. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలేనని స్పష్టం చేశారు. తాను కేవలం కోట్ చేశానని గుర్తు చేశారు. ఈ మేరకు ఓ పేపర్ కటింగ్ ను కూడా తన వాదనకు సాక్ష్యంగా కేటీఆర్ చూపించారు.
పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన 50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించానని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ పై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని కేటీఆర్ గుర్తు చేశారు. కోమటిరెడ్డి తాను చేసిన 50 కోట్ల లంచం వ్యాఖ్యల పైన వివరణ కూడా ఇవ్వలేదన్నారు. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని.. నా చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండని కేటీఆర్ సూచించారు.
ఇవే ఆరోపణలపై ఇప్పటికే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డిలై కోర్టుకు వెళ్లారు. వారికి వారెంట్ జారీ కావడంతో జనవరి పదో తేదీన మధురై కోర్టుకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మాణిక్కం ఠాగూర్ అప్పట్లోనే తన ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు తనపై చేసిన తప్పుడు ఆరోపణల మీద మధురై కోర్టులో పరువు నష్టం కేసు వేశానని... తనపై వచ్చిన ప్రతి ఆరోపణ పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరిస్త వ్సతున్నారు. మాణిక్కం ఠాగూర్ చేసిన పిటిషన్లపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి కొనుక్కున్నారన్న మీ పార్టీ నాయకుడు కోమటిరెడ్డిపై ఏమైనా పరువు నష్టం దావా కేసు వేశారా? అని బీఆర్ఎస్ ప్రశఅనిస్తోంది. కాగా పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి రూ.50 కోట్లకు కొనుగోలు చేశాడని... ఆ డబ్బులను మాణిక్కంకు ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు గతంలో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మధురై కోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నారు.
అప్పట్లో మాణిక్యం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉండేవారు. ఇప్పుడు ఆయన ఏపీకి నియమితులయ్యారు.