Saripodhaa Sanivaaram OTT Rights: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస హిట్లో మంచి జోష్ లో కొనసాగుతున్నారు. ఆయన రీసెంట్ మూవీ ‘హాయ్ నాన్న’ చక్కటి విజయాన్ని అందుకుంది. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా గత డిసెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే మీద విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయతో కలిసి ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నారు. సినిమా టైటిల్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ నెలకొంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్నది. ఇప్పటికే నాని, వివేక్ కాంబోలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ, వివేక్ పనితీరుకు ఇంప్రెస్ అయిన నాని, మరో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.


భారీ ధరకు ‘సరిపోదా శనివారం’ ఓటీటీ రైట్స్ అమ్ముడు!


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషలకు సంబంధించిన రైట్స్ కోసం ఏకంగా రూ. 45 కోట్లు వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే, నాని కెరీర్ లోనే అత్యధిక ధర పలికిన ఓటీటీ డీల్ గా రికార్డు క్రియేట్ చేయనుంది. త్వరలోనే ఈ డీల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’


అటు ‘సరిపోదా శనివారం’ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. నాని, ప్రియాంక మోహన్‌ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే వీళ్లిద్దరు కలిసి నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించారు. అప్పట్లో వీరిద్దిరి కాంబోపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. రెండో సినిమాలో ఎలా ఆకట్టుకుంటోరో చూడాలి. ఇక ఈ చిత్రంలో తమిళ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘దసరా’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న నాని, ‘సరిపోదా శనివారం’ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయలేదు.


Read Also: అలిపిరిలో ఆగిపోయిన ధనుష్ మూవీ షూటింగ్, అనుమతులు రద్దు - అసలు ఏం జరిగింది?