Telugu News Today: 'త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ' - కౌలు రైతులకూ గుడ్ న్యూస్
రైతుల రుణమాఫీపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా ఆయన రైతు రుణమాఫీపై గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని.. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని.. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఊరట - లుక్ అవుట్ సర్క్యులర్ నిలిపేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు
బేగంపేట ప్రజాభవన్ (Praja Bhawan) వద్ద కారుతో బారికేడ్లను ఢీకొట్టిన కేసుకు సంబంధించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమిర్ (Shakeel) మరో ఇద్దరిపై పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (LOC)ను నిలిపేస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కుమారుడి కారు ప్రమాదం కేసులో షకీల్ ను అరెస్ట్ చెయ్యొద్దని ఆదేశించింది. అయితే, పిటిషనర్లు ఈ నెల 23లోగా పోలీసుల ముందు విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


జోరు పెంచిన ఏపీ బీజేపీ, నేటి నుంచి పల్లెబాట
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జోరు పెంచుతోంది. కేంద్ర నాయకత్వం ఒకవైపు కూటమిలో చేరే దిశగా చర్చలు జరుపుతుంటే.. రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో బలాన్ని పెంచుకునే దిశగా కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పల్లెబాట పేరుతో రెండు రోజులపాటు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగాలని నిర్ణయించింది. గడిచిన పదేళ్లలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చింది, భవిష్యత్‌లో ఏం చేయబోతోందన్న విషయాలను ప్రజలకు ఈ కార్యక్రమంలో భాగంగా వివరించనున్నారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


మాజీమంత్రి నారాయణ ఇల్లు, ఆస్పత్రిలో ఔషధ నియంత్రణ అధికారుల సోదాలు
మాజీమంత్రి నారాయణ ఇంటితోపాటు ఆయనకు చెందిన ఆస్పత్రిలో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన అధికారులు ఔషధ దుకాణంతోపాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు తనిఖీలు చేసి పంచనామాపత్రం ఇచ్చి వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని హడావుడి - చివరికి డుమ్మా !
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విపక్ష నాయకుని హోదాలో తొలిసారిగా శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ  బడ్జెట్ ప్రసంగానికి  కూడా ఆయన  దూరంగా ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ, శాసన మండలి వాయాదా పడ్డాయి. సోమవారం కీలకమైన నీటి ప్రాజెక్టుల అంశంపై చర్చ జరగనుంది. ఆ రోజున కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది స్పష్టత లేదు. పదమూడో తేదీన నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి