Finance Minister Bhatti Vikramarka Presented 2024-25 Budget: తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) 2024-25 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పద్దును సభ ముందు ఉంచారు. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు రూ.32,557 కోట్లు కాగా.. రెవెన్యూ లోటు రూ.5,944 కోట్లుగా ఉంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక ఏడాదిలో తొలి 3 నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్ లో పొందుపరిచినా.. అంచనాలను మాత్రం ఏడాది మొత్తానికి ప్రకటించారు. అంతకు ముందు రాష్ట్ర కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతూ స్వేచ్ఛను సాధించుకున్నారని.. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి భట్టి తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప అని అమలు మాత్రం దిబ్బ అని అన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలు సహా వివిధ శాఖలకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు.


శాఖలకు కేటాయింపులు ఇలా



  • ఆరు గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు

  • వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు

  • పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు

  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు

  • విద్యా రంగానికి రూ.21,389 కోట్లు

  • వైద్య రంగానికి రూ.11,500 కోట్లు

  • మూసీ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు

  • ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు

  • ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాలకు రూ.1,250 కోట్టు

  • గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు

  • మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.8,000 కోట్లు

  • నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు

  • పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు

  • విద్యుత్, గృహజ్యోతికి రూ.2,418 కోట్లు

  • విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు

  • తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు రూ.500 కోట్లు

  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు

  • బీసీ వెల్ఫేర్‌ రూ.8,000 కోట్లు


Also Read: Ex MLA Shakeel: మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఊరట - లుక్ అవుట్ సర్క్యులర్ నిలిపేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు