అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని సున్నితమైన ఈ అంశంపై లోతుగా విచారణ చేస్తున్నాని తెలిపారు చంద్రబాబు. టీడీపీ ఆఫీస్‌లో మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో చంద్రబాబు కీలక అంశాలు ప్రస్తావించారు. రివర్స్ టెండరింగ్‌తో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని జగన్‌పై మండిపడ్డారు. అందులో భాగంగానే తిరుమల లడ్డూ వ్యవహారంలో కూడా కలుగుజేసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో నెయ్యి కిలో 600 రూపాయలుపైన అమ్ముడవుతుంటే తిరుమలకు కేవలం 320లకు ఎలా ఇవ్వగలిగారని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
జనసేన పార్టీలోకి వలసల వరద జరగనుంది. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేలోనే చేరేందుకు వైసీపీ నేతులు పెద్ద ఎత్తున రెడీ అయ్యారు. ఇప్పటి వరకూ బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వంటి వారు కాకుండా... పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కూడా జనసేనలో చేరేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఆదివారమే ఆయన పవన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. సామినేని ఉదయబాను కూడా అదివారమే జనసేనలో చేరనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


చంద్రబాబుకు థాంక్స్... నాగవంశీలా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్పు చేయలేదు 
నందమూరి, నారా కుటుంబాలకు... హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ (Jr NTR)కు మధ్య దూరం ఉందని ప్రచారం జరుగుతోంది. వారి మధ్య అనుబంధం గురించి ఓ వర్గం ఎప్పుడూ దుష్ప్రచారం చేస్తుంది. అయితే, 'దేవర' (Devara Movie) విడుదల సందర్భంగా అటువంటి పుకార్లకు మరోసారి చెక్ పడింది. ఏపీలోని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిదికి నిబంధనలకు విరుద్ధంగా భారీ కాంట్రాక్ట్ కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.  తెలంగాణలో రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి కథా చిత్రం నడుస్తోందని.. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు రూ.  8,888 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. సిఎం ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో భారీ అవినీతి జరిగిందని..  అమృత్ పథకం కింద తాగునీటి ప్రాజెక్టులు కోసం టెండర్లు పిలిచిన వ్యవహారంలో అంతా  గూడు పుఠాణి జరిగిందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
హైదరాబాద్‌లో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించిన సీతారాం ఏచూరి పేదల పక్షాన గళం విప్పారన్నారు. అలాంటి వ్యక్తి మరణం తీరని లోటని అభివర్ణించారు. ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి సీతారాం ఏచూరిని కలిసి మాట్లాడినప్పుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గుర్తొచ్చేవారన్నారు రేవంత్ రెడ్డి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి