KTR Allegatins on Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిదికి నిబంధనలకు విరుద్ధంగా భారీ కాంట్రాక్ట్ కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి కథా చిత్రం నడుస్తోందని.. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు రూ. 8,888 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.
సిఎం ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో భారీ అవినీతి జరిగిందని.. అమృత్ పథకం కింద తాగునీటి ప్రాజెక్టులు కోసం టెండర్లు పిలిచిన వ్యవహారంలో అంతా గూడు పుఠాణి జరిగిందన్నారు. రేవంత్ బావమరిది కి అమృతం.. తెలంగాణ ప్రజలకి విషం పంచుతున్నారని అన్నారు.
ఆధారాలతో సహా కేంద్రానికి ఫిర్యాదు చేశామన్న కేటీఆర్
అన్ని ఆధారాలతోనే తాను ఆరోపణలు చేస్తున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. అమృత్ టెండర్లలో జరిగిన అవినీతిని నిరూపిస్తానన్నారు. ఇండియన్... హోమ్ పైప్ అనే సంస్థ ను అడ్డు పెట్టుకొని సిఎం బావమరిది సూదిని సృజన్ రెడ్డి కి భారీ కాంట్రాక్టు ను కట్ట బెట్టారు.దీనిపై నేను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ కు పిర్యాదు చేశాననని ప్రకటించారు. బామ్మర్ది కళ్ళల్లో ఆనందం కోసం రేవంత్ ఇంత భారీ కాంట్రాక్టు ను అప్పగించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిబ్రవరి లో టెండర్లు పిలిచారు. ఇంత భారీ ప్రాజెక్ట్ టెండర్లు ఎవరికీ ఇచ్చారు అన్నది ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ విషయాలను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో చెప్పాలన్నారు.
కేంద్రం నిధులతోనే పథకం - కేంద్రం విచారణ చేయించకపోతే కుమ్మక్కయినట్లే
అమృత్ పథకం కింద ఇచ్చిన టెండర్ల నిధులు కేంద్రానివన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పథకం ఇది. దీనిపై కేంద్రమే విచారణ చేయించాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అయ్యాయి అన్న ఆరోపణ లు నిజం అని భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ , తెలంగాణ బీజేపీ ఎంపీలు దీనిపై మాట్లాడాలి. లేకపోతే మీ కుమ్మక్కు బయట బడినట్లేనన్నారు. ఇదొక్కటే కాదు...చాలా అవినీతి కథలు ఉన్నాయి. రోజుకొకటి బయట పెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అవినీతి నీ బయట పెడతామని.. అందులోనూ భారీ అవినీతి జరిగిందన్నారు.
రోజుకో స్కాం బయట పెడతామన్న కేటీఆర్
రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన th సిటీ 4 బ్రదర్ సిటీ గా మారిపోయిందన్నారు. రేవంత్ రెడ్డికి ఉన్న నలుగురు సోదరుల గురించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తల్చుకుంటే ముఖ్యమంత్రి పదవి పోతుందన్నారు. కుటుంబ సభ్యులకి ప్రయోజనం కల్పిస్తే...ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ముఖ్య మంత్రి పదవి పోతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇంతకు ముందు సోనియా గాంధీ, యెడ్యూరప్ప, పదవులు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు.