Telangana News Today: వికారాబాద్‌లో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన 


తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ సెంటర్‌‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీన్ని 2027 నాటికి పూర్తి చేయాలని చూస్తున్నారు. శంకుస్థాపన అనంతరం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజకీయాలకు అభివృద్ధి పనులకు ముడిపెట్టొద్దని సూచనలు చేశారు. ఇప్పటికే రాడార్ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు రాలేదని రేవంత్ వివరించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులు నియమించిన ప్రభుత్వం- అధికారిక ఉత్తర్వులు జారీ 
ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. ఒక్కొక్కరికి రెండు జిల్లాలను కేటాయించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ బాధ్యతల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయా జిల్లాల్లో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలు, నేతల మధ్య సమన్వయం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పూర్తి బాధ్యత వీళ్లకే ఇవ్వబోతున్నారు.  పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


అత్యాచారం కేసులో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి తెచ్చిన పోలీసులు 


సత్యసాయి జిల్లాలో సంచలనం రేపిన అత్తాకోడళ్ల అత్యాచారం కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. నిందితులుగా అనుమానిస్తున్న వారిని అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు నిందితులు మైనర్లుగా గుర్తించారు. అరెస్టు అయిన వారిలో ఒకడిపై 32కేసులు ఉన్నట్టు కూడా తేలింది. ఈ విషయాలు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత మీడియాకు వెల్లడించారు. నేరాలు తగ్గించే ప్రక్రియలో భాగంగా గడులు బడులపై నిఘా పెట్టామన్నారు. అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.  పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్న డీఎస్సీ 2024 అభ్యర్థులు 


డీఎస్సీ 2024లో ఉత్తీర్ణత సాధించి అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్న వాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు అధికారులు. ఉదయం ఈ కౌన్సెలింగ్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది ముందు వాయిదా పడినట్టు అధికారులు చెప్పారు. కానీ సాంకేతిక సమస్య పరిష్కారమైందని మళ్లీ అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. గత వారమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదివేల మందికిపైగా అభ్యర్థులు నియామకపత్రాలు తీసుసున్నారు.  పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


గ్రూప్‌ -1 మెయిన్స్‌ తొలగిన అడ్డంకి- 21 నుంచి పరీక్షలు ఖాయం


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పరీక్ష నిర్వహణపై అభ్యంతరాలు చెబుతూ, వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు విచారించిన కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. 21 నుంచి పరీక్ష నిర్వహణకు ఎలాంటి అటంకం లేకుండా తీర్పు వెల్లడించింది.


పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి