Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో వివిధి జిల్లాలకు మంత్రులను ఇన్‌ఛార్జ్‌లుగా ప్రభుత్వం నియమించింది. అయా జిల్లా నేతలను సమన్వయం చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా సాగేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. అతేకాకుండా ఆయా జిల్లాల నేతల మధ్య గ్యాప్‌ను తగ్గించే బాధ్యతను కూడా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. ప్రజలకు ప్రభుత్వానికి కళ్లు, చెవులు మాదిరిగా ఉంటూ కార్యక్రమాలు విజయవంతం చేయడమే వీరి లక్షం. 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ జిల్లాకు ఎవరిని నియమించారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ఎలాంటి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు కేటాయించలేదు.
| జిల్లా పేరు | ఇంఛార్జ్ మంత్రి పేరు | |
| 1 | శ్రీకాకుళం జిల్లా | కొండపల్లి శ్రీనివాస్ |
| 2 | పార్వతీపురం మన్యం, కోనసీమ | అచ్చెన్నాయుడు |
| 3 | విజయనగరం | వంగలపూడి అనిత |
| 4 | విశాఖ పట్నం | బాలవీరాంజనేయ స్వామి |
| 5 | అల్లూరి జిల్లా | సంద్యారాణి |
| 6 | అనకాపల్లి | కొల్లు రవీంద్ర |
| 7 | తూర్పుగోదావరి, కర్నూలు | నిమ్మల రామానాయుడు |
| 8 | కాకినాడ | నారాయణ |
| 9 | పశ్చిమ గోదావరి, పల్నాడు | గొట్టిపారి రవికుమార్ |
| 10 | బాపట్ల | పార్థసారథి |
| 11 | కృష్ణా జిల్లా | వాసంశెట్టి సుభాష్ |
| 12 | ఎన్టీఆర్ జిల్లా | సత్యకుమార్ |
| 13 | ప్రకాశం | ఆనం రామనారాయణ రెడ్డి |
| 14 | నెల్లూరు జిల్లా | ఫరూఖ్ |
| 15 | చిత్తూరు జిల్లా | రాంప్రసాద్ |
| 16 | అనంతపురం జిల్లా | టీజీ భరత్ |
| 17 | కడప జిల్లా | సవిత |
| 18 | అన్నమయ్యజిల్లా | బీసీ జనార్దన్ |
| 19 | ఏలూరు - | నాదెండ్ల మనోహర్ |
| 20 | తిరుపతి జిల్లా, సత్యసాయి జిల్లా | అనగాని సత్యప్రసాద్ |
| 21 | నంద్యాల జిల్లా | పయ్యావుల కేశవ్ |