భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్
దేశంలో క్రీడలకు కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో భేటీలో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Sports university)పై వారితో చర్చించారు. ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎలా ఉండాలన్న దానిపై సూచనలు చేశారు. ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలని, క్రీడా శిక్షణ సంస్థలను, అన్ని రకాల క్రీడలను ఒకే గొడుగు కిందకు తేవడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా చదవండి
హైదరాబాద్‌లో వాన బీభత్సం
హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నాలాలు పొంగి... మహానగరంలోని రోడ్లను చెరువులుగా మార్చాయి. నాలుగు రోజుల నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి. మొన్న (ఆదివారం) రాత్రి కుండపోత కురిసింది... సోమవారం ఉదయానికి వర్షం తగ్గినట్టే తగ్గి... భారీ దంచికొట్టింది. దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి... హైదరాబాద్ అల్లకల్లోలమైంది. ప్రధాన మార్గాలన్నీ... వరద నీటితో నిండిపోయాయి. దీంతో... వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఇంకా చదవండి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచో తెలుసా?
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. ఇంకా చదవండి