అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు


సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఇంకా చదవండి


సత్తెనపల్లి అసెంబ్లీనా? గుంటూరు ఎంపీనా?


కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ వైఎస్ఆర్‌సీపీకి తిరిగి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళగిరి కాకపోతే మరో నియోజకవర్గం సీటు ఆఫర్ ఇవ్వడంతోనే ఆయన తిరిగి వచ్చారని చెబుతున్నారు. మంగళగిరిలో ఖచ్చితంగా బీసీ సామాజికవర్గం అభ్యర్థికే టిక్కెట్ ఇస్తారు.  ప్రస్తుత ఇంచార్జ్ గంజి చిరంజీవా లేకపోతే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలనా అన్నది మరో నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడ పోటీ చేస్తారన్నది కూడా అప్పుడే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకా చదవండి


ఎమ్మెల్యే లాస్య నందితకు వరుస ప్రమాదాలు


సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్ వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెను ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు వెంటాడాయి. 2 ప్రమాదాల్లో ఆమె బయటపడినా.. మూడోసారి ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం 2023, డిసెంబర్ 24న బోయిన్పల్లి వద్ద ఆమె లిఫ్ట్ లో చిక్కుకున్నారు. ఇంకా చదవండి


వంద మంది విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గుడు


వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అని సీఎం జగన్ ఆరోపించారు. ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన  హాజరయ్యారు  ఒక్క పేదవాడికీ చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని.  మనం మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి రాక్షసుల్లా అడ్డుకున్నారని ఆరోపించారు.  పేదలకు మంచి జరగకుండా కోర్టులో 1191 కేసులు వేశారు. చంద్రబాబు కుట్రలను అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. ఇంకా చదవండి


పెనమలూరి బరిలోకి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు


తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెనమలూరు నుంచి బరిలో దిగేందుకు సినీ నటుడు, దివంగత సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన మనసులోని మాటను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వద్ద బయటపెట్టినట్టు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజులు ముందు ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత నుంచి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ అయిన తరువాత సినీ పరిశ్రమ నుంచి ఆయనే తొలుత స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. మృదుస్వభావిగా పేరున్న ఆయనను ఇక్కడి నుంచి బరిలోకి దించితే రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు తెలుగుదేశం పార్టీకి పని చేసే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు.