కూటమికి ఈసీ షాక్


జనసేన (Janasena) పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేయాలన్న విజ్ఞప్తిని ఎన్నికల సంఘం (Election Commission) తోసిపుచ్చింది. ఈ మేరకు గురువారం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన సింబల్ మార్చలేమని తెలిపింది. గాజు గ్లాస్ గుర్తుపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో టీడీపీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయగా.. దీనికి విచారణ అర్హత లేదని పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకూ పిటిషన్లు వస్తూనే ఉంటాయని వెల్లడించింది. జనసేన పిటిషన్ పై బుధవారం ఎన్నికల సంఘం కొన్ని నిర్ణయాలు వెలువరించింది. ఈ క్రమంలో పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 3 (శుక్రవారం)కు వాయిదా వేసింది. ఇంకా చదవండి


సీఎం జగన్ కు వైఎస్ షర్మిల మరో లేఖ


ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) సీఎం జగన్ కు 'నవ సందేహాల' (Nava Sandehalu) పేరుతో మరో లేఖ రాశారు. బుధవారం 9 ప్రశ్నలతో ఓ లేఖ రాయగా గురువారం మరో లేఖ రాశారు. ఇందులో ఉద్యోగాలకు సంబంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా చదవండి


కేసీఆర్ ప్రచారం నిషేదంపై జగదీష్ రెడ్డి


బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారాన్ని 48 గంటల పాటు ఈసీ బ్యాన్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మోడీ , రేవంత్ కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.  మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు.  కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీకి వణుకుడు మొదలైందని..   ఆ యాత్రతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తోందన్నారు.  కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నమేనని విమర్శించారు. ఇంకా చదవండి


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్


వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గురువారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. మే 9 (గురువారం) వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా.. ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 9న రాజీనామా చేయగా.. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవగా.. 2027, మార్చి వరకూ పదవీకాలం ఉంది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మే 27న ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించనుంది. ఇంకా చదవండి


బీఆర్ఎస్‌ మూలాలపై గురి పెట్టనున్న రేవంత్ !


లోక్‌సభ ఎన్నికలు కాగానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.   లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ గట్టిగా ఆశలు పెట్టుకుంది. పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని అనుకుంటున్నారు. కానీ వాస్తవ అంచనాలు ఎలా ఉంటాయో తెలియదు.  ఆ ఫలితాలు ఎలా ఉన్నా.. వెంటనే మరో సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ కావాల్సిందే. అవే స్థానిక ఎన్నికలు. లోక్ సభ ఎన్నికలు అయిపోగానే.. స్థానిక ఎన్నికలు పూర్తి చేసి.. పాలనపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇంకా చదవండి