Ys Sharmila Another Letter To Cm Jagan: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) సీఎం జగన్ కు 'నవ సందేహాల' (Nava Sandehalu) పేరుతో మరో లేఖ రాశారు. బుధవారం 9 ప్రశ్నలతో ఓ లేఖ రాయగా గురువారం మరో లేఖ రాశారు. ఇందులో ఉద్యోగాలకు సంబంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 


లేఖలో ప్రశ్నలివే


1. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది.?


2. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదు.?


3. గ్రూప్ - 2 కింద ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేదు?


4. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఏం చేశారు.?


5. వర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు.?


6. 23 వేలతో మెగా డీఎస్సీ అని 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు.?


7. నిరుద్యోగులు 7.7 శాతం పెరిగారంటే మీ వైఫల్యం కాదా.?


8. యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు.?


9. ప్రస్తుతం జాబ్ రావాలంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా.? అని షర్మిల తన లేఖలో ప్రశ్నించారు.


తొలి లేఖలో ఏం అడిగారంటే.?


సీఎం జగన్ (Cm Jagan) కు షర్మిల బుధవారం ఓ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా?, సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారు?, 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు.?, ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం రాష్ట్రంలో ఎందుకు నిలిచిపోయింది?, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?, దళిత, గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు?, SC, STలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా?, దళిత డ్రైవర్ ను చంపి సూట్ కేసులో డోర్ డెలివరి చేసిన MLCని ఎందుకు సమర్థిస్తున్నారు?, స్టడీ సర్కిల్స్ కి నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?.' అంటూ తొలి బహిరంగ లేఖలో ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలంటూ లేఖలో డిమాండ్ చేశారు. 


Also Read: Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌- బయటకి వస్తే భస్మమే