Jagdish Reddy Comments :   బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారాన్ని 48 గంటల పాటు ఈసీ బ్యాన్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మోడీ , రేవంత్ కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.  మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు.  కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీకి వణుకుడు మొదలైందని..   ఆ యాత్రతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తోందన్నారు.  కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నమేనని విమర్శించారు. 


రెట్టింపు ప్రజా మద్దతు 


కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రేట్టింపు ప్రజా మద్దతు వస్తుందని స్పష్టం చేశారు.  వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారని..  రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.  రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.  కేసీఆర్ లెవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే డ్రామాలు అని మండిపడ్డారు.   ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో స్పందించిన కేసీఆర్ మాటలను వక్రీకరించారని అన్నారు. 


మోడీ, రేవంత్ మాటలు ఈసీకి వినిపించవా ? 


మోడీ విద్వేషాలు ప్రచారం ఈసీకి కనిపించడంలేదా అంటూ ఫైర్ అయ్యారు.ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు, మా  సోషల్ మీడియా ఇంఛార్జి క్రిషాంక్ అరెస్టు, మా అధినేత కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్ర కు తెర లేపారని అన్నారు.వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడంలేదనీ ప్రశ్నించారు.రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని అన్నారు.కేసీఆర్ లెవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే  డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 


పదహారు సీట్లు గెలుస్తున్నాం ! 


నిషేధాలు ఏవీ కేసీఆర్ ని ఆపలేవు అన్నారు.కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడం లేదని ప్రజల్లో చర్చ మొదలైంది అన్నారు.ఎన్ని నిషేధాలు పెట్టినా 16 సీట్లు మావే అన్నారు. కేసీఆర్ కు మద్దతుగ నేతన్నలు కదిలివస్తున్నారని అన్నారు.కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుంది అన్నారు.  రేపు వివరణ  కు  రానున్న ఓటు కు నోటు కేసుపై మాట్లాడిన జగదీష్ రెడ్డి , ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉందన్నారు. అందుకే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోరాం అన్నారు. కోర్టు నుండి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.