తిరుమల నుంచే ప్రక్షాళన - సీఎంగా తొలి ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు


దేశంలోనే ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. గురువారం ఉదయం ఆయన సీఎం హోదాలో తొలిసారిగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించి మంచి తీర్పు ఇచ్చారని చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామి తన కులదైవమని.. ఆయన ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతోనే విజయం సాధించామని అన్నారు. 'నేను ఏ సంకల్పం తీసుకున్నా ముందు శ్రీవారిని దర్శించుకుంటాను. ప్రతిరోజూ ఉదయం నిండు మనస్సుతో ఒక్క నిమిషం ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తాను. రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైంది. గతంలో అలిపిరి వద్ద నాపై క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామే నన్ను రక్షించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలిగి పేదరికం లేని రాష్ట్రంగా మారాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని వేడుకున్నా. ఇప్పుడు సంపద సృష్టించడమే కాదు పేదలకు అందించడమే నా ప్రధాన లక్ష్యం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంకా చదవండి


జనసేన చీఫ్‌ పవన్‌కు కేటాయించిన శాఖలు ఇవే! 


ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణం చేశారు. పవన్ సహా 24 మంది మంత్రులు కూడా ఆయనతోపాటు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తీసుకునే శాఖ ఏమై ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ సస్పెన్స్‌కు ఇవాళ తెరపడనుంది. ఇంకా చదవండి


కేసీఆర్ చుట్టూ కేసులు, విచారణల వల


భారత  రాష్ట్ర సమితి అధినేత,మాాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలోని కమిషన్  నోటీసులు పంపింది. ఆయన పదవీకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (పీపీఏ) ప్రమేయంపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ సూచించింది. దీనిపై స్పందించిన కేసీఆర్ జులై 30 వరకు గడువు కావాలని కమిషన్ కి విజ్ఞప్తి చేశారు. కానీ సమయం ఇచ్చేందుకు కమిషన్ అంగీకరించలేదు. ఇంకా చదవండి


టీడీపీ కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గిందా?


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం కూడా ఏర్పడింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి పదవులు కూడా ఇతరులకు పంచాల్సి వచ్చింది.  మొత్తం ఇరవై ఐదు ఆరు మందికి మంత్రి పదవులు చాన్స్ ఉండగా చంద్రబాబునాయుడు ఇరవై ఐదు మందితో కేబినెట్ ఏర్పాటు చేశారు. మరొక్క బెర్త్ ఖాళీగా ఉంది. సామాజికవర్గాల పరంగా చూస్తే..కేబినెట్‌లో  అందరికీ న్యాయం జరిగిందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఎనిమిది మంది బీసీ మంత్రులకు చాన్స్ ఇచ్చారు. రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు ప్రాధాన్యత లభించింది. ఇంకా చదవండి


రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య పరీక్షలు


తెలంగాణలో (Telangana) పెద్దలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం అవుతోంది. పెరుగుతున్న జీవనశైలి వ్యాధులను అరికట్టేలా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ కోసం 10 మొబైల్ ల్యాబ్స్ సిద్ధం చేసినట్లు చెప్పారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం)లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టనుండగా.. కేంద్రం నుంచి 60 శాతం నిధులు సమకూరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చనుంది. గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు ముందస్తు పరీక్షలు నిర్వహించడం ద్వారా సకాలంలో చికిత్స అందించే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా చదవండి