Chandra Babu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణం చేశారు. పవన్ సహా 24 మంది మంత్రులు కూడా ఆయనతోపాటు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తీసుకునే శాఖ ఏమై ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ సస్పెన్స్‌కు ఇవాళ తెరపడనుంది.
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్‌కు ప్రజలతో ముడిపడి ఉండే శాఖను కేటాయించబోతున్నారట. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలనే అంశంపై కసరత్తు పూర్తి చేశారని అంటున్నారు. ఆ మేరకు పవన్ కల్యాణ్‌కు కీలకమైన శాఖలు ఇవ్వబోతున్నట్టు సమాచారం.
పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయం. అధికారిక ప్రకటన లేకపోయినా దీనిపై అందరూ ఓక్లారిటీకి వచ్చారు. ఇప్పుడు ఆయనకు కేటాయించే శాఖపై డిబేట్ నడుస్తోంది. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ పర్యావరణ శాఖలు కేటాయించినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
పవన్‌తోపాటు పదవీ ప్రమాణం చేసిన మరో ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలకు కూడా శాఖల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో స్పీకర్‌గా చేసిన అనుభవం ఉన్న నాదెండ్ల ఈసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనకు కీలకమైన పౌరసరఫరాల శాఖను అప్పగించబోతున్నారట. ఇంకో మంత్రి కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించనున్నారని సమాచారం అందుతోంది.
మరోవైపు టీడీపీ నుంచి గెలిచి మంత్రులుగా ప్రమాణ చేసిన ఎమ్మెల్యేలకి కూడా కీలక శాఖలు అప్పగించనున్నారని తెలుస్తోంది. బుధవారం ప్రమాణం చేసిన చంద్రబాబు సాయంత్రానికి నేరుగా తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకొని శాఖల విషయంపై మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నారు.