అమరావతి: ఏపీ మంత్రుల అభీష్టం, సమర్థత మేరకు వారికి శాఖలు కేటాయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపటిలోగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయిస్తా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందన్నారు. చంద్రబాబు తన కొత్త మంత్రివర్గంతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో సాయంత్రం సమావేశం అయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్ మాత్రం వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదని సమాచారం. వచ్చే ఐదేళ్లు పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ఈరోజు ఉన్న పరిస్థితిని రాష్ట్ర మంత్రులకు చంద్రబాబు వివరించారు.