బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం స్మగ్లింగ్ జరిగిందని గతంలో టీడీపీజనసేన పార్టీలు చేసిన ఆరోపణలకు ఇప్పుడు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. పౌరసరఫరాల మంత్రిగా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా అక్రమాలను వెలికి తీస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా కీలక ప్రకటన చేశారు. కాకినాడ నుంచి జరిగిన బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లుగా తనకు సమాచారం వచ్చిందన్నారు. ఒక్క కాకినాడలోనే 43వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భారీ స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించడం కష్టమన్నారు. అధికారులు రాత్రింబవళ్లు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం బియ్యం స్కాం గుట్టు రట్టు చేస్తామని ప్రకటించారు. ఇంకా చదవండి


విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎలాంటి ఆందోళన వద్దు


విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించడం తమ బాధ్యత అని.. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి (Kumara Swamy) అన్నారు. విశాఖ (Visakha) పర్యటనలో భాగంగా ఆయన గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను (Visakha Steel Plant) సందర్శించారు. ఉక్కు ఉత్పత్తి సహా అన్ని విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల వివరాలను కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు. ప్లాంట్స్ సందర్శన అనంతరం కుమార స్వామి మీడియాతో మాట్లాడారు. 'విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఉక్కు పరిశ్రమపై అనేక మంది ఆధారపడి ఉన్నారు. ప్రజలు, సిబ్బంది ఎలాంటి ఆందోళనలు చెందొద్దు. విశాఖ ప్రైవేటీకరణకు అవకాశం లేదు. ఇక్కడ పరిశీలించిన ప్రతీ అంశాన్ని నోట్ చేసుకున్నా. ప్రధాని మోదీకి (PM Modi) అన్ని అంశాలను వివరిస్తా. ఆయన ఆశీస్సులతో పరిశ్రమలో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది.' అని కుమార స్వామి స్పష్టం చేశారు. ఇంకా చదవండి


ఆగస్టు 15 నుంచి ఏపీ ప్రజలకు పండగే


పింఛన్లు పెంపు, మెగా డీఎస్సీ , ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు సహా పలు హామీలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం...మరో మూడు కీలక ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు (Anna Canteen), మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus), హెల్త్‌ ఇన్స్‌రెన్స్( Health Insurance) పథకాలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంకా చదవండి


రోడ్డు ప్రమాదంలో మిస్టర్ తెలంగాణ మృతి


ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ (Mister Telangana) విజేత మహ్మద్ సోహైల్ (23) (Mohammad Sohail) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సోహైల్ తన స్నేహితుడు మహ్మద్ ఖదీర్‌తో కలిసి జూన్ 29న సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్‌పై వేగంగా వెళ్తుండగా.. అదుపు తప్పి స్క్రాప్ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సోహైల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇంకా చదవండి


అమరావతి నిర్మాణానికి ఇంకా ఎన్నో సవాళ్లు


రాజధాని ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి పెద్దది. రాజధాని లేని నగరం అంటూ ఐదేళ్ల పాటు జరిగిన ప్రచారానికి ఎన్నికలతో తెరపడినట్లయింది. అయితే ఐదేళ్లలో జరిగిన విధ్వంసం కారణంగా ఎన్ని రోజుల్లో  మళ్లీ అమరావతి నిర్మాణాన్ని లైన్‌లోకి తెస్తారో చంద్రబాబు కూడా చెప్పలేకపోతున్నారు. పాతిక వేల ఎకరాల్లో ఐదేళ్ల పాటు పెరిగిపోయిన మొక్కలు, చెట్లను తీయించడానికి జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించారు. దీనికి రెండు నెలలకుపైగా సమయం పడుతుంది. అదొక్కటే సమస్య కాదు. గత ప్రభుత్వం వల్ల కోర్టుల్లో పడిన కేసులు.. ఇంకా కొన్ని చోట్ల భూములు ఇవ్వని రైతులు..నిధులు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా చదవండి