హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం


హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు ఆ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అది స్వల్పంగా ధ్వంసమైంది. వెంటనే ఆమె మరో వాహనంలో వెళ్లిపోయారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా చదవండి


నిర్మాతతో కిదాంబి శ్రీకాంత్ పెళ్లి


బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ సినీ పరిశ్రమకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లాడబోతున్నారు. ఆమె రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ. ప్రస్తుతం శ్రావ్య వర్మ టాలీవుడ్‌లో పలువురికి కాస్ట్యూమ్ డిజైనర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రపంచ నెంబర్ 1గా ఉన్న బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఏపీకి చెందిన కిదాంబి శ్రీకాంత్ ఈమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. శనివారం రాత్రి ఈ విషయాన్ని వీళ్లిద్దరూ ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంకా చదవండి


ఆగస్టులో వరుస సెలవులు, తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్స్ ఇవే


ఆగస్టు నెలలో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు సెలవు రోజుల కారణంగా ప్రయాణికుల రద్దీ ఉండనుందని రైల్వే భావిస్తోంది. అందుకని ఈ నెల13 నుంచి 19 వరకు తెలుగు రాష్ట్రాల పరిధిలో వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాచిగూడ - తిరుపతి, తిరుపతి కాచిగూడ, మచిలీపట్నం - వికారాబాద్, వికారాబాద్ - మచిలీపట్నం, హైదరాబాద్ - సాంత్రగాచి, సాంత్రగాచి - హైదరాబాద్, నర్సాపూర్ - నాగర్ సోల్, నాగర్ సోల్ - నర్సాపూర్, నర్సాపూర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - నర్సాపూర్ స్టేషన్ల మధ్యలో వేర్వేరు తేదీల్లో ప్రత్యేక రైళ్లను  నడపనున్నారు. ఇంకా చదవండి


తెలంగాణలో అమెజాన్ విస్తరణకు ఆసక్తి


అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఇంకా చదవండి


సీనియర్ నేతలంతా ఎవరికి వారే యమునా తీరే


పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లతో దూసుకెళ్లిపోవాల్సిన తెలంగాణ బీజేపీ పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయింది. దీనికి కారణం ఏమిటో ఆ పార్టీ క్యాడర్‌కు మెల్లగా అర్థమవుతోంది. పార్టీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరాటం వల్లనే ఎవరికి వారు పట్టించుకోవడం మానేయడంతో సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు. మరి పార్టీ హైకమాండ్ ఈ సమస్యను ఎందుకు గుర్తించడం లేదో మాత్రం వారికి అర్థం కావడం లేదు. ఇంకా చదవండి