South Central Railway: ఆగస్టు నెలలో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు సెలవు రోజుల కారణంగా ప్రయాణికుల రద్దీ ఉండనుందని రైల్వే భావిస్తోంది. అందుకని ఈ నెల13 నుంచి 19 వరకు తెలుగు రాష్ట్రాల పరిధిలో వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాచిగూడ - తిరుపతి, తిరుపతి కాచిగూడ, మచిలీపట్నం - వికారాబాద్, వికారాబాద్ - మచిలీపట్నం, హైదరాబాద్ - సాంత్రగాచి, సాంత్రగాచి - హైదరాబాద్, నర్సాపూర్ - నాగర్ సోల్, నాగర్ సోల్ - నర్సాపూర్, నర్సాపూర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - నర్సాపూర్ స్టేషన్ల మధ్యలో వేర్వేరు తేదీల్లో ప్రత్యేక రైళ్లను  నడపనున్నారు.


ఈ ప్రత్యేక రైళ్లలో నర్సాపూర్ - నాగర్ సోల్ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ముత్కేడ్, నాందేడ్, పూర్ణ, పర్భని, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగనున్నట్లు ప్రకటించారు.


నర్సాపూర్ సికింద్రాబాద్ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనున్నట్లు ప్రకటించారు. 










గుంటూరు పరిధిలో రైళ్ల మళ్లింపు


గుంటూరు డివిజన్ పరిధిలో కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లుగా కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ - సాంత్రాగచ్చి రైలును ఆగస్టు 13న కాజీపేట - వరంగల్ - విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. నిజానికి ఈ రైలు నల్గొండ - మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా వెళ్లాల్సి ఉంది.


అలాగే భువనేశ్వర్ - పుణె రైలును విజయవాడ - వరంగల్ - కాజీపేట - సికింద్రాబాద్ మీదుగా మళ్లిస్తారు. ఈ రైలు గుంటూరు - నల్గొండ మీదుగా వెళ్లాల్సి ఉంది.