ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఈసీ లేఖ


ఏపీ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మరో లేఖ రాసింది.  జనవరిలో ప్రారంభించిన పథకాలకే ఇప్పటి వరకు నగదు ఇవ్వని మీకు.. ఇప్పుడు ఒకే సారి ఇంత నగదు ఎలా వచ్చిందని  ఈసీ ప్రశ్నించింది. ఈ రోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ..  మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఇంకా చదవండి


ఆర్టీసీ బస్‌లో రేవంత్ రెడ్డి, రాహుల్


హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జనజాతర సభ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆర్టీసీ బస్‌లో ప్రయాణం చేశారు. మహిళలు, యువతతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్‌ ప్రయాణంపై  ఆరా తీశారు. ఇంకా చదవండి


లోకేష్‌ అడ్డాలో సీఎం జగన్ భారీ సభ


ఐదేళ్లు పాలించాలని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కేవలం పూర్తి కాలం ఉండనీయకుండా చేస్తున్నారని మంగళగిరి సభలో సీఎం, వైసీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. 57 నెలలకే ప్రజాప్రభుత్వం గొంతు పిసికేయలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అందాల్సిన పథకాలను కూడా అందనీయకుండా చేస్తుంటే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా కోర్టుల్లో పోరాటం చేస్తున్నారని అన్నారు. ఇంకా చదవండి


తెలంగాణ మంత్రులకు విషమ పరీక్ష


పనితీరుకు తగ్గట్లే పదవులు ఉంటాయని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తెలంగాణ నేతలకు స్పష్టమైన సంకేతాలు  వస్తున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత కీలకం. గెలిచి తీరాల్సి ఉంది. అందుకే ఎలాంటి చిన్న నిర్లక్ష్యాన్ని సహించడం లేదు. తెలంగాణలో ఈ సారి పది నుంచి పధ్నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉండటంతో  ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. మంత్రుల్ని ఇంచార్జులుగా నియమించారు. వారి పని తీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. తాజాగా పార్టీ నేత కేసీ వేణుగోపాల్ చేసిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చరు.  చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవడంపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల వ్యూహాలపై కేసీ వేణుగోపాల్ .. ఇంచార్జులతో సమావేశం నిర్వహించారు. ఇందులో కోమటిరెడ్డి తీరుపై వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. చెప్పిన పని ఎందుకు చేయడం లేదని.. పని చేసే వారికే పదవులు ఉంటాయని నేరుగానే చెప్పారు. ఇంకా చదవండి


'ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపేయండి' - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు (Ap Sand Mining) వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నిర్దేశించింది. అటు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారని.. అక్కడ తవ్వకాలు నిలిపేశారా.? లేదా.? అనేది తనిఖీలు చేపట్టాలని సూచించింది. కాగా, రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపేయాలని.. అనుమతి ఉన్న చోట యంత్రాలు కూడా ఉపయోగించొద్దని ఏప్రిల్ 29వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, ఆ తర్వాత కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నాగేంద్రకుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలు జరిగిన తేదీ, టైం, ఇసుక రవాణా చేస్తోన్న వాహనాల ఫోటోలను న్యాయస్థానం ముందు ఉంచారు. ఇంకా చదవండి