Top 10 Headlines Today


 


జనం నమ్ముతారా?


బీజేపీ , బీఆర్ఎస్ మధ్య ఏదో ఉంటే ఈ కార్యక్రమాలన్నీ ఎందుకని  బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ పదాధికారుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం తెలంగాణలో బీజేపీ,  బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం విస్తృతంగా జరుగుతూండటం.. ప్రజల్లోనూ అదే అభిప్రాయం ఉండటమే. అయితే ఇటీవల ఆ అభిప్రాయాన్ని మార్చడానికి ప్రధాని మోదీ తీవ్రమైన  ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేశారు. తెలంగాణకు వరాలు ప్రకటించారు మరి ఇప్పుడైనా తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యర్థి అని ప్రజలు నమ్ముతారా?పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఏపీ బీజేపీలో అయోమయం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి  అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపు వైసీపీపై ఢిల్లీ స్థాయిలో అభిమానం చూపిస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం పోరాడమని చెబుతున్నారు. మరో వైపు పొత్తులో ఉన్న జనసేన  కలిసి రావడం లేదు. తమతోనే కలిసి రావాలని జనసేన డిమాండ్ చేస్తోంది. కలవడానికి టీడీపీ అంగీకరిస్తుందో లేదో తెలియదు. మొత్తంగా ఇప్పుడు ఒంటరిగా ప్రయత్నాలు చేయలేక.. ఇతర పార్టీలతో కలిసే అవకాశం లేక ఏపీ బీజేపీ నేతలు దీనంగా కేంద్ర పార్టీ వైపు చూస్తున్నారు. కానీ ఏపీ బీజేపీని పట్టించుకునేంత తీరిక ఇప్పుడు కేంద్ర పార్టీకి లేదు. ఫలితంగా ఏపీ బీజేపీ పరిస్థితి దైవాధీనం సర్వీస్‌లా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అచ్చెన్న ఫైర్


స్కిల్ డెవలప్మెంట్‌కి సంబంధించి రూ.27 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయ పార్టీకి రూ.20 వేలకు మించి నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లైతే అలాంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సదరు పార్టీ వారు తెలియజేస్తారని చెప్పారు. అవి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయని.. ఏప్రిల్ 2023లో ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి తెలుగుదేశం పార్టీ నిధుల వివరాలను సీఐడీ అధికారికంగా డౌన్ లోడ్ చేశారని చెప్పారు. అందులోనే ఎవరు ఏ రోజు ఎంత మొత్తంలో విరాళాలిచ్చారో స్పష్టంగా ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అసంతృప్తులకు పదవులు


తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి చైర్మన్ గా తాటి కొండ రాజయ్య నియమితులు అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి (అక్టోబరు 5) ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ ను నియమించారు. వీళ్ల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కానిస్టేబుల్ కుటుంబం


తెలంగాణలో కానిస్టేబుల్‌ నియామకాల ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. మొత్తం 16,604 కానిస్టేబుల్ పోస్టులకుగాను 15,750 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటించింది. అయితే కోర్టులో కేసుల దృష్ట్యా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని బోర్డు తెలిపింది. పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని స్పష్టంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నేడు చంద్రబాబుతో లోకేష్ ములాఖత్


స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజులుగా హస్తినలో ఉన్న ఆయన.. గురువారం రాత్రి విజయవాడకు తిరిగొచ్చారు. ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు లోకేష్ చేరుకున్నారు. లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలతో కరచాలనం, అభివాదం చేసిన లోకేష్.. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


ఎన్డీఏలో ఉన్నట్టా? లేనట్టా?


మొత్తం 175 సీట్లు వైసీపీకే వస్తాయని ఆ పార్టీలు నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు జనసేనకు భయపడాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం సీట్లు మీకు వస్తే టీడీపీ, జనసేనకు భయపడనక్కర్లేదు కదా? అని ప్రశ్నించారు. ఎన్డీయే కూటమిలో మేము ఉంటే ఏంటి..? లేకపోతే మీకు ఏంటి? అని వైసీపీ నేతలను నిలదీశారు. జనసేనకు 170 ఎమ్మెల్యే సీట్లు, 30 ఎంపీ సీట్లు ఉంటే ప్రతిపక్షాల ఊసే ఎత్తనని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ భవిష్యత్తు తేలుస్తానని అన్నారు. తనపై దాడి చేయడానికి వైసీపీ శ్రేణులు కార్యాలయం చుట్టూ మోహరించారని. ఆ సమయంలోనే తాను పారిపోకుండా ఆఫీసులోనే కూర్చున్నట్లు పవన్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నేడు పాకిస్థాన్ vs నెదర్లాండ్స్


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో శుక్రవారం రెండో మ్యాచ్‌ జరుగుతుంది. హైదరాబాద్‌ వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్‌ తలపడుతున్నాయి. దాయాది కొన్నేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టింది. ఆటగాళ్లు గాయపడటంతో ఇబ్బంది పడుతోంది. నెదర్లాండ్స్‌ మాత్రం ఉత్సాహంతో కనిపిస్తుంది. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న తపనతో ఉంది. మరి ఈ పోరులో గెలిచేదెవరు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి?పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రెండు.. ఇప్పుడిదో ట్రెండు


ఒక సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడం అనేది ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో పలు పాన్‌ ఇండియా చిత్రాలు రెండు పార్ట్స్ థియేటర్లలోకి వచ్చి, ప్రేక్షకులను అలరించాయి. ఫస్ట్ పార్ట్ తో జనాల్లో ఆసక్తిని రేకెత్తించి, రెండో భాగంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. 'రక్త చరిత్ర' సినిమాతో సంచలన దర్శకుడు ఒక కథను రెండు భాగాలుగా చెప్పే విధానానికి శ్రీకారం చుట్టగా.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి 'బాహుబలి' చిత్రంతో దాన్ని ట్రెండ్ గా మార్చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీ అంతా అదే ఫాలో అవుతూ వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బిగ్ బాస్‌లో ఫేక్‌ ఆటగాళ్లు


బిగ్ బాస్‌లోకి వెళ్లే ముందు అందులోని కొందరు కంటెస్టెంట్స్.. ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంది. వారిని సీరియల్స్‌లో, షోలలో, యూట్యూబ్ వీడియోలలో.. ఇలా ఏదో ఒకచోట చూసే ఉంటారు. కానీ ఆ కంటెస్టెంట్స్ బయట ఎలా ఉంటారు, అసలు వారి క్యారెక్టర్ ఏంటి, వారు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన తర్వాతే తెలుసుకుంటారు ప్రేక్షకులు. అలా తెలుసుకున్న తర్వాత అందరిపై వారి అభిప్రాయాలు మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా ఉన్నవారిలో ప్రేక్షకులకు బాగా తెలిసిన కంటెస్టెంట్‌ ఒకరిపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతోంది. అంతే కాకుండా తనకు ఫేక్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి