Top 10 Headlines Today


 


రాత మారుస్తారా?


టీడీపీ శ్రేణుల్లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు.. నారా బ్రహ్మణి. తెలుగుదేశం అధినేత.. చంద్రబాబును అరెస్ట్ చేయడం.. యువనేత లోకేష్ ను అరెస్టు చేస్తారని చెబుతుండటంతో.. ఎప్పటి నుంచో అడపా దడపా వినిపిస్తున్న ఆ పేరు మరి కాస్త ఎక్కువుగా లౌడ్ గా వినిపిస్తోంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని.. పార్టీలో లీడ్ రోల్ ప్లే చేయాలని చాలా సందర్భాల్లో చర్చకు వచ్చినా.. తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం ఆమెను ముందుకు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనివార్యమయ్యేలా ఉందా..? అందుకు ఆమె సిద్ధమవుతున్నారా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?


తెలంగాణ బీజేపీ సర్వశక్తులు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత పుంజుకోకపోగా మరింత బలహీనపడినట్లయింది. ఓ వైపు కేంద్ర మంత్రిగా.. మరో వైపు రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న సమయంలో ఇక పూర్తిగా తెలంగాణకే సమయం కేటాయించనున్నారు. హైకమాండ్ కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచాలని నిర్ణయించింది. నేతలు, పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బీమా దానం 


దానధర్మాలు, స్వచ్ఛంద సమాజ సేవ చేసే మంచి మనుషులు మనలో చాలా మంది ఉన్నారు. అన్నదానం చేయడం, విద్యార్థులను దత్తత తీసుకోవడం, మూగజీవాలకు ఆహారం అందించడం, విరాళాలు ఇవ్వడం వంటి డబ్బుతో కూడుకున్న పనులను కొందరు ఎంచుకుంటారు. డబ్బు ఖర్చు చేసే స్థోమత లేని వాళ్లు... పేద విద్యార్థులకు చదువు చెప్పడం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గోవడం, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేయడం వంటి బాటను ఎంచుకుంటారు. తోటివారికి సాయం చేయాలన్న మనస్సు ఉంటే, ఏ మార్గమైనా సన్మార్గమే. ఈసారి, ఇలాంటి సేవలకు భిన్నంగా ఆలోచిద్దాం. ఒక పేద కుటుంబం మొత్తానికి ఆర్థిక రక్షణను అందించే బీమా పాలసీని కొనిద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జగన్‌తో గౌతం అదానీ భేటీ 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీ కలిశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన నేరుగా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. గతంలోనూ పలుమార్లు గౌతం అదానీ  తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. అయితే ఎప్పుడూ అధికారికంగా భేటీల గురించి సీఎంవో కానీ.. సీఎం క్యాంప్ ఆఫీసు వర్గాలు కానీ ప్రకటన చేయలేదు. ఓ సారి తన కుటుంబంలో శుభకార్యానికి ఆహ్వానించేందుకు వచ్చారని అనధికారికంగా చెప్పారు. ఇప్పుడు అలాంటి ఆహ్వానం కోసం వచ్చి ఉంటారని అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలంగాణలో వర్షాలు 


నిన్నటి ఉత్తర అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం ఈరోజు ఉత్తర కోస్తా కర్నాటక, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రం మట్టానికికి 4.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతుంది. నిన్న తమిళనాడు కోస్తా వద్ద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఈ రోజు అదే ప్రాంతంలో సగటు సముద్రం మట్టంకి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతుంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బీఆర్‌ఎస్‌ టు కాంగ్రెస్


బీఆర్​ఎస్​ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. మైనంపల్లితో పాటు వేముల వీరేశం, కుంభం అనిల్​కుమార్​ పార్టీ కండువా కప్పుకున్నారు. మైనంపల్లి కుమారుడు రోహిత్ కూడా వీరితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో వీరందరికీ ఖర్గే పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అక్షర్ స్థానంలో అశ్విన్


ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆల్ రౌండర్ అక్షర్‌ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీస్‌కు అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ టోర్నీలో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో వేరే ఆలోచన లేకుండా గాయం కారణంగా జట్టుకు దూరమైన అక్షర్ స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇచ్చారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సిద్ధార్థ్‌కు అవమానం 


హీరో సిద్ధార్థ్ ‘చిత్తా’ (తెలుగులో ‘చిన్నా’) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ గురువారం తమిళం, కన్నడ భాషల్లో ఒకే రోజు రిలీజైంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కోసం కర్ణాటక వెళ్లిన సిద్ధార్థ్‌కు అక్కడ ఘోర అవమానం జరిగింది. బెంగళూరులోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు ఆటకం కలిగించారు. తమిళోడివి నీకు కర్ణాటకలో ఏం పని? అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వెంటనే ప్రెస్ మీట్ ఆపాలని డిమాండ్ చేశారు. తమిళ సినిమాలను ప్రోత్సహించవద్దని అక్కడ ఉన్న విలేకరులను కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మెగా డీల్


మెగా హీరోల్లో రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ జానెర్స్ లో సినిమాలు తీస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఈ మధ్య కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ అవి ఏవీ వర్కౌట్ అవ్వడం లేదు. అలా అని నిరాశ చెందకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండే కథలని ఎంచుకుంటున్నాడు. రీసెంట్ గా 'గాండీవ దారి అర్జున' సినిమాతో డిజాస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి భారీ డీల్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా వరుస ప్లాపుల్లో కూరుకుపోయిన వరుణ్ తేజ్ భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నువ్వు ఎప్పటికీ ది బెస్ట్


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆఫ్ స్క్రీన్ లోనూ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చాయి. వీటన్నిటిని కాస్త పక్కన పెడితే.. తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ ను ఉద్దేశిస్తూ 'నువ్వు ఎప్పటికీ ది బెస్ట్' అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఉన్నట్టుండి రష్మిక విజయ్ గురించి ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి