Top 10 Headlines Today: 


2023లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాల్లో స్టార్ ఎవరు?


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు 2013 కీలక మలుపు. అత్యంత సీనియర్ అయిన చంద్రబాబుతో పాటు భవిష్యత్‌లో ఏపీలో  రాజకీయ నేతలుగా పోటీ ఉంటుందని భావిస్తున్న మరో ముగ్గురు నేతలు ఈ ఏడాది తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదా అన్నది పోలింగ్ తర్వాత వచ్చే ఫలితాల్లో తేలుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఇమేజ్ పెంచుకుంటున్న రేవంత్ 


తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు స్పష్టమైన తేడాను ప్రజలు చూస్తున్నారు. కళ్ల ఎదురుగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కన్నా ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తోంది ప్రభుత్వం అందుబాటులోకి రావడం.  కింది స్థాయి ప్రజల నుంచి ఎమ్మెల్యేల వరకూ అందరి అభిప్రాయం ఇదే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


విశాఖ వెళ్లేది ఇప్పుడు కాదా?


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు (High Court) నిర్ణయం తర్వాతే విశాఖ (Vizag)కు కార్యాలయాలను తరలించనున్నట్లు తెలిపింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్ణయించిన సర్కార్, కార్యాలయాలను సిద్ధం చేసింది. ఏ యే కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉంటాయో కూడా చెప్పేసింది. రాజధాని తరలింపుపై అమరావతి రైతులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. త్రిసభ్య ధర్మాసనం రాజధానిపై తరలింపుపై తగిన ఉత్తర్వులు ఇచ్చే వరకు, కార్యాలయాలను తరలించబోమని ఏపీ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


క్లియరెన్స్‌ ఆఫర్


తెలంగాణ(Telangana)లో వాహనదారులకు పోలీసులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ చలానాలు(Pending Traffic Challans) క్లియర్ చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వబోతున్నారు. గతంలో మాదిరిగానే రాయితీ కల్పించబోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వాహనదారులకు ఫైన్స్ వేస్తుంటారు పోలీసులు. హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో చూసి ఫైన్లు వేస్తుంటే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటోలు తీసి ఫైన్ వేస్తుంటారు. ఇలా రకరరకాల మార్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తిరుమలలో పెరిగిన రద్దీ


తిరుపతి(Tirupati)కి శ్రీవారి భక్తులు పోటెత్తారు. వైకుంఠం పర్వదినం పురస్కరించుకుని వైకుంఠ ద్వారం దర్శనం టోకెన్లను టిటిడి(TTD) జారీ చేస్తున్న వేళ భారీ సంఖ్యలో‌ భక్తులు చేరుకుటున్నారు. ముఖ్యంగా తమిళనాడు(Tamilanadu), కర్ణాటక(Karnataka) భక్తులు తిరుపతికి చేరుకోవడంతో టోకెన్ల(Tokens) జారీ కేంద్రాల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా శుక్రవారం మధ్యాహ్నం జారీ చేయాల్సిన ఉచిత టోకెన్లను గురువారం అర్ధరాత్రి 11 గంటలకే‌ తిరుపతిలో టిటిడి జారీ చేసింది. మొత్తం తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్త‌య్యేంత వ‌ర‌కు మొత్తం 4,23,500 స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది..పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కేటీఆర్ కీలక సమావేశం


హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లకు పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


దిగొచ్చిన ప్రభుత్వం


కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్ వాడీ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం చర్చలు చేపట్టినప్పటికీ విఫలమవుతూ వచ్చాయి. తాజాగా అంగన్‌వాడీల కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సలార్ ఎలా ఉంది?


'బాహుబలి'తో ప్రభాస్ మీద అంచనాలు పెరిగాయి. అయితే, ఆ స్థాయి విజయం రాలేదు. 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో ప్రభాస్ సినిమా చేయడంతో మాంచి యాక్షన్ ఫిల్మ్ చూడవచ్చని, రెబల్ స్టార్ ఖాతాలో మరో హిట్ కన్ఫర్మ్ అని అభిమానులు ఆశ పడ్డారు. మరి, సినిమా ఎలా ఉంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?


రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. 'కెజియఫ్', 'కెజియఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన చిత్రమిది. శుక్రవారం (డిసెంబర్ 22న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. మరి, ఓటీటీ సంగతి ఏంటి? ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది? అంటే...  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


సఫారీ గడ్డపై సిరీస్


సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. 2018 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ గెలిచి రికార్డు సృష్టించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఘన విజయంతో భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌... సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్‌ వర్మ కూడా అర్ధ శతకంతో సత్తా చాటడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 78 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి... వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి