Vaikunta Dwara Darshanam In Tirumala: తిరుపతి(Tirupati)కి శ్రీవారి భక్తులు పోటెత్తారు. వైకుంఠం పర్వదినం పురస్కరించుకుని వైకుంఠ ద్వారం దర్శనం టోకెన్లను టిటిడి(TTD) జారీ చేస్తున్న వేళ భారీ సంఖ్యలో భక్తులు చేరుకుటున్నారు. ముఖ్యంగా తమిళనాడు(Tamilanadu), కర్ణాటక(Karnataka) భక్తులు తిరుపతికి చేరుకోవడంతో టోకెన్ల(Tokens) జారీ కేంద్రాల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా శుక్రవారం మధ్యాహ్నం జారీ చేయాల్సిన ఉచిత టోకెన్లను గురువారం అర్ధరాత్రి 11 గంటలకే తిరుపతిలో టిటిడి జారీ చేసింది. మొత్తం తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది..
టోకెన్ జారీ కేంద్రాలు ఇవే
తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవింద రాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో ఉచితంగా సర్వదర్శన టోకెన్లు టిటిడి జారీ చేస్తున్నారు. టోకన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టిటిడి ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టింది..
టోకెన్లు పొందిన 24 గంటల తర్వాతే దర్శనం
టోకెన్లను పొందిన భక్తులు 24గంటల సమయం ముందే తిరుమలకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు కేటాయిస్తామన్నారు. టోకెన్స్ లేని భక్తులు తిరుమలకు రావొచ్చు, కానీ ఆ భక్తులకు శ్రీవారి దర్శనంతోపాటు గదులను కేటాయించలేమని అధికారులు స్పష్టం చేశారు.
డిసెంబర్ 23వ తేదీ వేకువజామున 1.45 నిమిషాలకు వైకుంఠ ద్వారం తెరుచుకోనుంది. అప్పటి నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించనుంది. 10 రోజుల పాటు ఈ అవకాశం ఇవ్వబోతోంది. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను టిటిడి అర్చకులు మూసివేయనున్నారు.. ఈ పది రోజులు సిఫారస్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేసింది. తిరుమల్లో వసతి సమస్య ఉందని, వీఐపీలు టీటీడీకి సహకరించి తిరుపతిలో వసతిని పొందాలని అధికారులు సూచించారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు..
కర్ణాటక నుంచి తిరుమలకు కాలిన నడకన వస్తున్న శునం
కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నగరానికి చెందిన భక్తులు ఏడుకొండల వాడి వైకుంఠ ద్వార దర్శనార్థం గడిచిన మూడు సంవత్సరాలుగా పాదయాత్రగా తిరుమలకు వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు.. వీరి యాత్రలో భాగంగా తిరుమల కలియుగ వెంకన్న స్వామి వైకుంఠ ఏకాదశి దర్శనార్థం పాదయాత్రగా వస్తున్న వీరిని ఓ శునకం ఆశ్చర్యానికి గురి చేసింది..
కర్ణాటక చెందిన ఈ భక్తులు గత మూడు సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి రోజున పాదయాత్రగా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. అందులో భాగంగా నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో మార్గం మధ్యలో మరి కొంతమంది స్నేహితులు జత కలపడంతో అందరూ కలిసి పాదయాత్ర కర్ణాటక హుబ్లీ నుంచి పలు గ్రామాలు దాటుకుంటూ సాగిన యాత్ర మధ్యాహ్నం భోజనానికి ఒక ఊరి దగ్గర ఆగారు.. వీరున్న చోటకి ఒక వీధి కుక్క వచ్చి చేరింది.. భోజనం అనంతరం ప్రారంభమైన యాత్ర వీరి వెనకనే వీధి కుక్క కూడా పయనం సాగించింది.. యాత్రికులు
ఎంత మంది ఆ శునకంపై అరచినా తిరిగిపోలేదు.. వీరి వెంటే నడుచయకుంటూ ఆ కుక్క తీరు చూసి యాత్రికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.. యాత్రికుల వెంటే తిరుమల చేరుకుంటుందని ఆనందంగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు యాత్రికులు.